హోమ్ /వార్తలు /బిజినెస్ /

JIO Diwali Offer: రూ.699 కే ఫోన్ అందిస్తున్న జియో..

JIO Diwali Offer: రూ.699 కే ఫోన్ అందిస్తున్న జియో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Diwali | JIO Offer | ఇప్పటి వరకు జియో ఫోన్‌ను రూ.1500 అందిస్తుండగా.. దీపావళి ఆఫర్ కింద కేవలం రూ.699కే అందిస్తోంది.

టెలికం రంగంలో తనదైన ముద్ర వేసుకొని దూసుకుపోతున్న జియో మరో సంచనానికి తెర తీసింది. డేటా, కాల్స్, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్, టీవీ సేవల్ని అందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న ఈ సంస్థ.. మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు జియో ఫోన్‌ను రూ.1500 అందిస్తుండగా.. దీపావళి ఆఫర్ కింద కేవలం రూ.699కే అందిస్తోంది. పైగా, ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయకుండానే ఫోన్‌ను కొనవచ్చట. ఈ మేరకు జియో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గతంలోలా ఎలాంటి ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా అదే ధరకు జియో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు’ అని సంస్థ ప్రకటించింది.

ఇక, ఈ ఫోన్‌ను కొన్నవారికి మొదటి 7 రీఛార్జీలపై అదనంగా రూ.99 విలువ చేసే మొబైల్ డేటాను జియో ఉచితంగా అందించనుంది. దీంతో ఫోన్ కొనుగోలుపై రూ.800, 7 రీఛార్జీల డేటా విలువ రూ.700 కలిపి మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చు. కేవలం దీపావళి వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని జియో స్పష్టం చేసింది.

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Diwali 2019, Jio, Mobile, Mobile Data, Reliance Jio

ఉత్తమ కథలు