జియో నుంచి ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే...ఇకపై ఐయూసీ చార్జీ 6 పైసలు/నిమిషం

కంపెనీ రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం ఈ ఐయూసీ టాప్ ఓచర్లతో పాటు అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది.

news18-telugu
Updated: October 9, 2019, 7:22 PM IST
జియో నుంచి ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే...ఇకపై ఐయూసీ చార్జీ 6 పైసలు/నిమిషం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇకపై జియో కస్టమర్లు ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఈ నెల 9 నుంచి అందుబాటులోకి రానుంది. అంటే జియో రీచార్జ్ చేయించుకునే కస్టమర్లందరూ నేటి నుంచి ఇతర మొబైల్ ఆపరేటర్ల నెట్ వర్క్‌లకు కాల్ చేసినప్పుడు ఈ ఐయూసీ చార్జ్ కింద ప్రతి నిమిషానికి 6 పైసలు కట్ అవుతుంది. ఇందుకోసం ఐయూసీ టాప్ అప్ వోచర్లను సైతం ప్రవేశపెట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా ట్రాప్ జీరో టెర్మినేషన్ చార్జ్ ను తొలగించే వరకూ ఈ టాప్ అప్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ నిబంధన జనవరి 1, 2020 వరకూ అమల్లోకి ఉండనుంది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జియో నుంచి జియో నెట్ వర్క్ కు కాల్ చేస్తే ఎలాంటి ఐయూసీ చార్జీలు వర్తించవు. అలాగే ఇన్ కమింగ్ కాల్స్‌కు సైతం ఈ చార్జీలు వర్తించవు. దీంతో పాటు లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

కంపెనీ రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం ఈ ఐయూసీ టాప్ ఓచర్లతో అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది.

ఐయూసీ చార్జ్ ఇలా...


అలాగే ప్రకటనలో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు సైతం ప్రతి నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీ బిల్లులో కలుపుతుండగా, అందుకు తగ్గట్టుగానే ఉచిత డేటాను సైతం అందించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. అలాగే టారిఫ్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని కంపెనీ తెలిపింది. అయితే ట్రాయ్ ఐయూసీ చార్జీలను తొలగించే వరకూ మాత్రమే ఈ ఐయూసీ చార్జీల వసూలు ఉంటుందని కంపెనీ తెలిపింది. నిజానికి కొత్త సంవత్సరం తొలి రోజు జనవరి 1, 2020 నాటి నుంచి ఐయూసీ చార్జీలను తొలగించాలని ట్రాయ్ యోచిస్తోందని తెలిపింది.

First published: October 9, 2019, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading