ఆంధ్రప్రదేశ్లోని 38 నగరాలు, పట్టణాల్లోని తమ జియో పాయింట్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలను రిలయన్స్ ప్రారంభించింది. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ జియో పాయింట్ స్టోర్ల లో సంస్థ, మొబైల్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, ఇతర చిన్న గృహోపకరణాల వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలను చేపట్టనున్నట్లు జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ వెల్లడించారు. ప్రారంభ ఆఫర్ కింద వినియోగదారులకు రూ.1100 విలువైన బహుమతులు, రూ.300 విలువైన గిఫ్ట్ వోచర్లు ఖచ్చితంగా లభిస్తాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ సదుపాయం లేకుండా లేదా ఆన్లైన్లో ఎప్పుడూ షాపింగ్ చేయని వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జియో పాయింట్ స్టోర్లు రూపొందించారు. పెద్ద నగరాలు మొదలుకొని చిన్న స్థాయి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటికే విస్తరించిన ఉన్న ఈ జియో పాయింట్ స్టోర్లు వినియోగదారుల నుంచి విశేష ఆదరణను చూరగొంటున్నాయి.
ఇప్పటివరకు ఈ స్టోర్లలో కేవలం 4G మొబైల్స్, జియో సిమ్ అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు ప్రారంభిస్తున్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలతో ఈ స్టోర్లు మరింత చేరువ కానున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:August 28, 2020, 19:42 IST