JIO PIF DEAL JIO PLATFORMS GETS 11TH INVESTOR AS SAUDI ARABIAS PIF JOINS RUSH FOR RIL UNIT SS
Jio-PIF deal: జియోతో రూ.11,367 కోట్ల డీల్ కుదుర్చుకున్న సౌదీకి చెందిన సంస్థ
Jio-PIF deal: జియోలో రూ.11,367 కోట్ల పెట్టుబడికి సౌదీకి చెందిన సంస్థ
(ప్రతీకాత్మక చిత్రం)
Jio-PIF deal | రిలయెన్స్ జియో ఖాతాలో మరో డీల్ చేరింది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్-PIF రిలయెన్స్ జియోతో తాజాగా డీల్ కుదుర్చుకుంది.
రిలయెన్స్ జియో వరుసగా డీల్స్ కుదుర్చుకుంటున్న సంగతి తెలిసిందే. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్-PIF జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.11,367 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాలు పొందనుంది సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్-PIF. జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ వ్యాల్యుయేషన్‌ను రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ వ్యాల్యూయేషన్‌ను రూ.5.16 లక్షల కోట్లుగా లెక్కించారు. ఇటీవల కాలంలో రిలయెన్స్ జియో కుదుర్చుకున్న 11వ డీల్ ఇది. రిలయెన్స్ జియో 9 వారాల్లో మొత్తం 11 డీల్స్ కుదుర్చుకోవడం విశేషం. ఈ 11 డీల్స్ ద్వారా 24.7 శాతం వాటాలను అమ్మి రూ.115,693.95 కోట్ల నిధుల్ని సేకరించింది రిలయెన్స్ జియో.
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలతో రిలయెన్స్ జియో డీల్స్ కుదుర్చుకునే పరంపర ఏప్రిల్ 22న ప్రారంభమైంది. మొదట ఫేస్బుక్ రూ.43,574 కోట్లతో 9.99 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఆ తర్వాత జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ రెండుసార్లు, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, కేకేఆర్, ముబదాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ క్యాటర్టాన్, టీపీజీ సంస్థలు వరుసగా డీల్స్ కుదుర్చుకున్నాయి.