జియో ప్లాట్ ఫారమ్స్ లిమిటెడ్(Jio Platforms Limited), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance Industries Limited) యొక్క డిజిటల్ సర్వీసుల(Digital Services) విభాగం మరియు డిజిబాక్స్(Digi Box) అనే స్వదేశీ స్టోరేజ్ సర్వీస్ భాగస్వామ్యం చేసుకున్నాయి. భవిష్యత్ వినియోగదారుల(Future Customers) యొక్క క్లౌడ్ (Cloud) కన్సాలిడేషన్ అవసరాలను మరింత తీర్చడం లక్ష్యంగా ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంతో, ప్రస్తుతం అందించబడిన 20GB స్టోరేజీ స్పేస్ తో పాటు, వినియోగదారులు జియోఫోటోస్ యాప్ ద్వారా సైన్ అప్ చేయడం తో డిజిబాక్స్ లో అదనంగా 10GB స్టోరేజ్ స్పేస్(Storage Space) ను పొందవచ్చు. అంతే కాకుండా ఆ యూజర్లు ఫోల్డర్లను (Folders) కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ నుంచి ఫొటోలు(Photos), వీడియోలను(Videos) అప్ లోడ్(Upload) చేసుకొని తక్షణమే భాగస్వామ్యం చేయవచ్చు.
అంతే కాకుండా వివిధ ఫార్మాట్ల ఫైల్ లను ఒకే చోట సేవ్ చేయవచ్చు. జియో కస్టమర్లు ఆటో-సింక్ ని ఎనేబుల్ చేయడం ద్వారా తమ వ్యక్తిగత డేటాను స్టోర్ చేసుకోవచ్చు. జియో సెట్ టాప్ బాక్స్ లోని(Setup Box) వీటిని ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా వీక్షించవచ్చు. వ్యక్తిగత ఫోటోలు మరియు వీడియోలను అప్ లోడ్ చేయడానికి మరియు యాక్సెస్ చేయడానికి జియో సెట్ టాప్ బాక్స్ వినియోగదారులు తమ డిజిబాక్స్ ఖాతాను జియోఫోటోస్ యాప్ కి జోడించవచ్చు. ఇది ప్రతి జియో సెట్ టాప్ బాక్స్ లో ముందే లోడ్ చేయబడుతుంది. జియోఫోటోస్ తో జియో వినియోగదారులు గూగుల్ ఫోటోలు, జియోక్లౌడ్ వంటి విభిన్న క్లౌడ్ స్టోరేజీలలో స్టోర్ చేయబడిన వారి కంటెంట్ మొత్తాన్ని యాక్సెస్ చేయవచ్చు.
జియో సెట్ టాప్ బాక్స్ లో ఫేస్బుక్ మరియు ఇన్మాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో భాగస్వామ్యం చేస్తారు. మొత్తం కంటెంట్ కాలక్రమానుసారంగా లేదా లొకేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. మరియు కొన్ని ఫోటోలు మరియు వీడియోలను సమూహపరచడానికి ఫేషియల్ రికగ్నిషన్ కూడా ఉంది. ఒక వినియోగదారు తమ డిజిబాక్స్ ఖాతాను జియోఫోటోస్ యాప్ కి జోడించినప్పుడు, డిజిబాక్స్ ఖాతాలోని అన్ని ఫోటోలు మరియు వీడియోలు సులభంగా వీక్షించడానికి మరియు యాక్సెస్ చేయడానికి ట్యాబ్ లుగా జాబితా నిర్వహించబడతాయి.
Loan in 30 seconds: అర నిమిషంలో పర్సనల్ లోన్... వాట్సప్‌లో Hi అని టైప్ చేయండి చాలు
" జియో ప్లాట్ ఫామ్ లతో మా కొత్త భాగస్వామ్యం గురించి మేము చాలా సంతోషిస్తున్నాము" అని డిజిబాక్స్" CEO అర్నాబ్ మిత్రా అన్నారు. “ఈ కూటమి డిజిటల్ గా యాక్టివ్ గా ఉన్న కొత్త వినియోగదారులకు మా యాజమాన్య సాంకేతికతను అందించడంలో మాకు సహాయం చేస్తుంది. జియో వినియోగదారులు ఈ ఇంటిగ్రేషన్ వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందుతారు . దేశంలో అతిపెద్ద , అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యాపారంతో ఎంపిక అనేది ఎంతో గౌరవించదగినదని’’ అన్నారు.
జియో ప్లాట్ ఫామ్ లిమిటెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిరణ్ థామస్ మాట్లాడుతూ.. భారత్ లో రూపొందించబడిన స్టోరేజ్ ప్లాట్ ఫామ్ అయిన డిజిబాక్స్ ని కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నామన్నారు. ఎందుకంటే వారి ఆఫర్లు అనేవి వినియోగదారులకు సురక్షితంగా.. వేగవంతగా, స్పష్టంగా ఉంటాయన్నారు. ఈ ఇంటిగ్రేషన్ అనేది అదనపు స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం చూస్తున్న జియో యూజర్లందరికీ ఒక అసమానమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. దీనిని సులభంగా యాక్సెస్ చేయవచ్చని అన్నారు.
Credit Card Rules: క్రెడిట్ కార్డు కస్టమర్లకు గుడ్ న్యూస్.. జులై 1 నుంచి కొత్త రూల్స్
డిజిబాక్స్ గురించి..
డిజిబాక్స్ అనేది 2020లో స్థాపించబడింది. ఇది సురక్షితమైన, వేగవంతమైన, సహజమైన మరియు సరసమైన ధరతో కూడిన భారతీయ డిజిటల్ ఫైల్ స్టోరేజీ. ఇది వ్యక్తులు మరియు వ్యాపారాల కోసం 'మేడ్ ఇన్ ఇండియా' క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ మరియు డిజిటల్ అసెట్ మేనేజ్ మెంట్ ప్లాట్ ఫామ్. తక్కువ వ్యవధిలో, డిజిబాక్స్ దాని ఆత్మనిర్భర్ సేవతో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఖాతాదారులను సంపాదించింది. ఫైల్ స్టోరేజ్ మరియు షేరింగ్ అనేది సహజమైన, సురక్షితమైన, సహకారంతో కూడినది. డేటాను ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయాలనుకునే ఎవరైనా-వ్యక్తులు, వ్యాపారులు అందరికీ ఇది అనుకూలంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం www.digiboxx.com ను సందర్శించవచ్చు.
New Rules: అలర్ట్... జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్
జియోఫోటోస్ గురించి..
జియోఫోటోస్ అనేది USB డ్రైవ్ లు, గూగుల్ ఫోటోస్, జియోక్లౌడ్ మరియు డిజిబాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ ఖాతాలలో నిల్వ చేయబడతాయి. అంతే కాదు.. ఫేస్బుక్ మరియు ఇన్నాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో నేరుగా షేర్ చేసుకోవచ్చు. అన్ని ఫోటోలు, వీడియోలు మరియు చలనచిత్రాలను టీవీలో వీక్షించడానికి ఇది ఒక వన్-స్టాప్ యాప్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digi box, Jio, Reliance Digital