news18-telugu
Updated: June 13, 2020, 11:20 PM IST
జియో లోగో
రిలయన్స్ జియో మరో డీల్ పూర్తి చేసింది. పదో డీల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఎల్ కాటర్టన్ అనే ప్రపంచంలో పెద్దదైన వినియోగదారుల ఫోకస్‌గా పనిచేసే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జియోలో పెట్టుబడులు పెడుతోంది. రూ. 1,894.50 కోట్లు చెల్లించి జియో ప్లాట్‌ఫాంల్లో 0.39 శాతం వాటాను దక్కించుకుంది. ఈ డీల్‌తో కలిపి రిలయన్స్ జియో ఇప్పటి వరకు ఏడు వారాల్లో పది డీల్స్ పూర్తి చేసింది. రిలయన్స్ జియో ఇప్పటి వరకు 22.38 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 104,326.65 కోట్ల పెట్టుబడులను సాధించింది. ఎల్ కాటర్టన్ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ వినియోగదారుల బ్రాండ్స్‌లో సుమారు 200కు పైగా పెట్టుబడులు పెట్టింది. అంతకు కొద్ది గంటల క్రితమే అమెరికాకు చెందిన టీపీజీ సంస్థ రూ.4,546.80 కోట్లు చెల్లించి 0.93 శాతం వాటాలను సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ‘ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతిక సాధనంతో వినియోగదారులకు అత్యుత్తమ సర్వీసు అందిస్తున్న జియో ప్లాట్ ఫాంలోకి లా కాటర్టన్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. వినియోగదారుల కేంద్రంగా జరిగే వ్యాపారంలో లా కాటర్టన్ లాంటి విలువైన సంస్థ అనుభవాన్ని భవిష్యత్తులో మరింత పొందాలనుకుంటున్నాం. డిజిటల్ లీడర్‌గా భారత్ ఎదగడానికి కలసి పనిచేస్తాం.’ అని అన్నారు.
లా కాటర్టన్ గ్లోబల్ కో సీఈఓ మైఖెల్ చూ మాట్లాడుతూ ‘30 ఏళ్ల మా సంస్థ హిస్టరీలో ఎన్నో వినియోగదారుల బ్రాండ్లను నిలబెట్టడానికి కృషి చేశాం. జియో గ్రాఫిక్స్, రిటైలర్స్, డిజిటల్‌గా స్థానిక బ్రాండ్లకు సహకారం అందించాం. జియోతో పార్టనర్షిప్ కావడం ఆనందంగా ఉంది.’ అని అన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
June 13, 2020, 10:50 PM IST