• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • JIO KKR DEAL AMERICAN GLOBAL INVESTMENT FIRM TO INVEST RS 11367 CRORES IN JIO PLATFORMS SS

Jio KKR Deal: రిలయెన్స్ జియోలో రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కేకేఆర్

Jio KKR Deal: రిలయెన్స్ జియోలో రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కేకేఆర్

Jio KKR Deal: రిలయెన్స్ జియోలో రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కేకేఆర్ (ప్రతీకాత్మక చిత్రం)

Jio KKR Deal | గత నెల రోజులుగా రిలయెన్స్ జియో పలు డీల్స్ కుదుర్చుకుంది. వరుసగా ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ సంస్థలతో జియో డీల్స్ చేసుకుంది.

  • Share this:
    భారతదేశంలో సంచలనాలు సృష్టిస్తున్న టెలికాం సంస్థ రిలయెన్స్ జియో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల వరుసగా పెట్టుబడ్లని ఆకర్షిస్తున్న రిలయెన్స్ జియోలో రూ.11,367 పెట్టుబడులు పెట్టేందుకు కేకేఆర్ సంస్థ డీల్ కుదుర్చుకుంది. రిలయెన్స్ జియోలో ఇది ఐదో పెట్టుబడి. కేకేఆర్ అమెరికాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ. ఇప్పటివరకు ఆసియాలోనే కేకేఆర్ అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదే.

    ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన పెట్టుబడి సంస్థ కేకేఆర్‌ను స్వాగతించడం సంతోషంగా ఉంది. భారతీయులందరి ప్రయోజనాల కోసం భారతీయ డిజిటల్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి, మార్చడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో విలువైన భాగస్వామి. భారతదేశంలో ప్రీమియర్ డిజిటల్ సొసైటీని నిర్మించాలనే మా ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కేకేఆర్‌ పంచుకుంటుంది. కేకేఆర్‌ అనేక ప్రముఖ ఫ్రాంచైజీలకు విలువైన భాగస్వామిగా మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. చాలా సంవత్సరాలుగా భారతదేశానికి కట్టుబడి ఉంది. జియోను మరింతగా పెంచడానికి కేకేఆర్‌ గ్లోబల్ ప్లాట్‌ఫాం, పరిశ్రమ పరిజ్ఞానం, కార్యాచరణ నైపుణ్యం ఉపయోగపడుతుంది.
    ముకేష్ అంబానీ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రిలయెన్స్ ఇండస్ట్రీస్


    ఈ పెట్టుబడి ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32% ఈక్విటీ వాటాను పొందనుంది కేకేఆర్. జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ వ్యాల్యూను రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూను రూ.5.16 లక్షల కోట్లుగా లెక్కించారు.

    భారతదేశంలో జియో ప్లాట్‌ఫామ్స్ చేస్తున్నట్టుగా దేశంలోని డిజిటల్ ఎకోసిస్టమ్‌ను మార్చే సత్తా కొన్ని కంపెనీలకే ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్ భారతదేశంలో ఎదిగిన నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ లీడర్. ఆసియా పసిఫిక్‌తో పాటు భారతదేశంలో లీడింగ్ టెక్నాలజీ కంపెనీలకు మేము ఇచ్చే మద్దతు కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ డీల్ ఒక బలమైన నిదర్శనం.
    హెన్రీ క్రావిస్, కో-ఫౌండర్, కో-సీఈఓ, కేకేఆర్


    గత నెల రోజులుగా రిలయెన్స్ జియో పలు డీల్స్ కుదుర్చుకుంది. వరుసగా ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ సంస్థలతో జియో డీల్స్ చేసుకుంది. ఈ డీల్స్ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.78,562 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌ రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన నెక్స్ట్‌ జనరేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అన్న సంగతి తెలిసిందే. భారతదేశవ్యాప్తంగా తక్కువ ధరకే డిజిటల్ సేవల్ని అందిస్తూ 38.8 కోట్ల సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, స్మార్ట్ డివైజెస్, క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిక్స్‌డ్ రియాలిటీ, బ్లాక్‌చెయిన్ లాంటి టెక్నాలజీలతో రూపొందిన డిజిటల్ ఎకోసిస్టమ్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. 130 కోట్ల మంది ప్రజలు, చిరు వ్యాపారులు, రైతులకు డిజిటల్ ఇండియా సేవల్ని అందించడమే జియో లక్ష్యం.

    ఇవి కూడా చదవండి:

    Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్... కెనెరా బ్యాంక్ ఆఫర్

    PMSBY Scheme: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్‌కు ఏడాదికి రూ.12 మాత్రమే... వివరాలివే

    Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు