JIO INVITES ADMISSIONS FOR PG COURSES REGARDING DATA SCIENCE DIGITAL MEDIA AND ARTIFICIAL INTELLIGENCE AK
Jio ఇన్స్టిట్యూట్లో డేటా సైన్స్ సహా పలు పీజీ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం
అడ్మిషన్ల దరఖాస్తుకు చివరి తేదీ మే 20
Jio దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా సంస్థ, AI, డేటా సైన్స్ 2025 నాటికి భారతదేశ GDPకి 450 నుండి 500 బిలియన్ డాలర్లను అందిస్తుందని NASSCOM నివేదిక వెల్లడించింది.
జియో ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ మీడియా, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో ఒక సంవత్సరం పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్‌ను ప్రారంభించింది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ మే 20గా ఖరారు చేసింది. సమాజం, పరిశ్రమల కోసం ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ పీజీ కోర్సు ముఖ్య లక్ష్యం. అదే సమయంలో డిజిటల్ మీడియా అండ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ కోర్సు అనేది డిజిటల్ యుగంలో కస్టమర్ అనుభవాన్ని మెరుగ్గా నిర్వహించడానికి విద్యార్థికి జ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. అభివృద్ధి చెందుతున్న రంగంలో కొత్త ఉద్యోగాల కోసం యువతను సిద్ధం చేయడమే ఈ కోర్సుల లక్ష్యమని జియో ఇన్స్టిట్యూట్ (Jio Institute) పేర్కొంది.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా సంస్థ, AI, డేటా సైన్స్ 2025 నాటికి భారతదేశ GDPకి 450 నుండి 500 బిలియన్ డాలర్లను అందిస్తుందని NASSCOM నివేదిక వెల్లడించింది. అదే సమయంలో దేశంలోని మీడియా, వినోద పరిశ్రమ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం.. ఈ రంగం 2030 నాటికి వంద బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,(Artificial Intelligence) మార్కెటింగ్ కమ్యూనికేషన్లు(Marketing Communication) గతంలో కంటే ఇప్పుడు మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియాకు టెలికమ్యూనికేషన్స్, ఇమెయిల్, మెసేజింగ్, ఇంటర్నెట్ శోధన, స్మార్ట్ గాడ్జెట్లు, కమ్యూటింగ్, బ్యాంకింగ్, వినోదం, షాపింగ్, AI, కమ్యూనికేషన్లకు ముఖ్యమైన పాత్ర ఉంది.
కస్టమర్లతో ఉత్తమంగా కమ్యూనికేట్ చేయడానికి డేటా, కస్టమర్ ప్రొఫైల్‌లు ఉపయోగించబడుతున్నాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ మీడియా, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ నిపుణుల కోసం అధిక వృద్ధి ఉద్యోగ పాత్రలను సృష్టిస్తుంది. జూన్ 2021లో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ జియో ఇన్స్టిట్యూట్ గురించి ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్లను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు www.jioinstitute.edu.inలో లభిస్తాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.