Home /News /business /

JIO FOURTH DEAL GENERAL ATLANTIC TO INVEST RS 6598 CRORE IN RELIANCE JIO BA

Reliance Jio-General Atlantic | జియో నాలుగో డీల్... విలువ రూ.6598 కోట్లు

మే 17, 2020. రిలయన్స్ జియోలో 1.34 శాతం వాటా కోసం రూ.6598 కోట్లు చెల్లించిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్.

మే 17, 2020. రిలయన్స్ జియోలో 1.34 శాతం వాటా కోసం రూ.6598 కోట్లు చెల్లించిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్.

Jio Fourth Deal | జనరల్ అట్లాంటిక్ సంస్థ రిలయన్స్ జియోలో రూ.6598 కోట్ల పెట్టుబడులు పెట్టింది.

    రిలయన్స్ జియోలో మరో గ్లోబల్ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టింది. జనరల్ అట్లాంటిక్ సంస్థ రిలయన్స్ జియోలో రూ.6598 కోట్ల పెట్టుబడులు పెట్టింది. జియోలో 1.34 శాతం వాటా కొనుగోలు కోసం జనరల్ అట్లాంటిక్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించనుంది. జనరల్ అట్లాంటిక్ సంస్థ ఆసియాలో పెట్టిన పెట్టుబడుల్లో ఇదే అతి పెద్దది. ఇప్పటికే ఫేస్ బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు జనరల్ అట్లాంటిక్ పెట్టిన పెట్టుబడులతో కలిపి నాలుగు వారాల్లోనే రిలయన్స్ జియో రూ.67,194.75 కోట్ల పెట్టుబడులను పొందగలిగింది. భారత్‌లో డిజిటల్ సమాజం పెరుగుదలకు ఈ పెట్టుబడి ఉపయోగపడనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల కంపెనీలు అన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వరుసగా పెట్టుబడులను ఆకర్షిస్తూ జియో దూసుకుపోతోంది.జియోలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. కొత్త పెట్టుబడుల ద్వారా కృత్రిమ మేథస్సు, బ్లాక్ చైన్, ఏఆర్ / వీఆర్, బిగ్ డేటాను భారతీయులకు అందజేయడం మరింత సులభతరం అవుతుంది. ఇలాంటి అద్భుత అవకాశాలు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేవు. రిలయన్స్ యాజమాన్యం ద్వారా ఇది సాధ్యమైంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Jio, Reliance Jio

    తదుపరి వార్తలు