Jio First Day First Show Movie : జియో ఆఫర్‌పై పీవీఆర్,ఐనాక్స్ రియాక్షన్ ఇదీ..

Jio First Day First Show Movie : దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థకు 800 మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి. రిలయన్స్ జియో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫర్ తీసుకొచ్చినా.. తమకు ఆదరణ తగ్గదని ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది. ఇంట్లో సినిమా చూడటం.. థియేటర్‌‌లో సినిమా చూడటం.. రెండు వేర్వేరు ఎక్స్‌పీరియెన్స్ అని.. కాబట్టి మల్టీప్లెక్స్‌లకు ఆదరణ తగ్గదని అంటోంది.

news18-telugu
Updated: August 13, 2019, 4:56 PM IST
Jio First Day First Show Movie : జియో ఆఫర్‌పై పీవీఆర్,ఐనాక్స్ రియాక్షన్ ఇదీ..
ముఖేశ్ అంబానీ
news18-telugu
Updated: August 13, 2019, 4:56 PM IST
రెండేళ్ల క్రితం జియో సిమ్‌తో రిలయన్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ దెబ్బకు టెలికాం మార్కెట్లో మిగతా కంపెనీలు కుదేలైపోయాయి.జియోతో పోటీని తట్టుకోలేక ఢీలా పడ్డాయి. రిలయన్స్ జియో ఇప్పుడు ఫైబర్ నెట్ రంగంలోకి దిగుతుండటంతో.. మిగతా సంస్థలకు టెన్షన్ పట్టుకుంది. మరీ ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రకటించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ' ఆఫర్‌తో మల్టీప్లెక్స్ థియేటర్ రంగం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలైన పీవీఆర్,ఐనాక్స్ యజమానులు రిలయన్స్ నిర్ణయంపై స్పందించారు. రిలయన్స్ నిర్ణయం మల్టీప్లెక్స్‌లపై పెద్దగా ప్రభావం చూపించదని పీవీఆర్ యాజమాన్యం పేర్కొనగా.. ఆర్థికంగా ప్రతికూల ప్రభావం తప్పదని ఐనాక్స్ యాజమాన్యం పేర్కొనడం గమనార్హం.

దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థకు 800 మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి. రిలయన్స్ జియో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫర్ తీసుకొచ్చినా.. తమకు ఆదరణ తగ్గదని ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది. ఇంట్లో సినిమా చూడటం.. థియేటర్‌‌లో సినిమా చూడటం.. రెండు వేర్వేరు ఎక్స్‌పీరియెన్స్ అని.. కాబట్టి మల్టీప్లెక్స్‌లకు ఆదరణ తగ్గదని అంటోంది.మరోవైపు ఐనాక్స్ యాజమాన్యం మాత్రం.. థియేటర్ వ్యవస్థ వల్ల నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్స్,మల్టీప్లెక్స్ యజమానులు లాభపడుతున్నారని.. రిలయన్స్ జియో ఆఫర్‌తో ఆయా రంగాలపై ప్రభావం పడుతుందని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ వ్యవస్థ విజయవంతంగా నడుస్తోందని.. రిలయన్స్ జియో ఆఫర్‌తో దేశంలోని థియేటర్లకు గడ్డు పరిస్థితి తప్పదని అంటోంది.

సినిమాకి యజమాని నిర్మాతనే అని.. సినిమాను ఎవరికి అమ్ముకోవాలనేది అతని నిర్ణయమే అని ఐనాక్స్ యాజమాన్యం పేర్కొంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, మల్టీప్లెక్స్ యజమానుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎనిమిది వారాల పాటు సినిమాను థియేటర్‌లో ప్రదర్శించాలన్న నిబంధనం ఉందని తెలిపింది. ఆ తర్వాతే ఆన్‌లైన్ లేదా ఇతర మాధ్యమాల్లో విడుదల చేస్తారని చెప్పింది. కాగా,రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సోమవారం జియో ఫ్యూచర్ ప్లాన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2020 నుంచి జియో 'ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ' ఆఫర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అంబానీ ప్రకటనతో భవిష్యత్తులో థియేటర్ల మనుగడకు కాలం చెల్లినట్టేనా? అన్న చర్చ జరుగుతోంది.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...