Jio Effect : BSNL బంపర్ ఆఫర్ జూన్ 30 వరకూ పొడిగింపు... రోజుకు 2.21GB డేటా...

BSNL Offer : నిజానికి జనవరి నుంచీ ఏప్రిల్ 30 వరకే ఈ ఆఫర్ ఉంది. ఇలాంటిదే ఓ ఆఫర్‌ను సెప్టెంబర్ 2018లో ప్రకటించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 4, 2019, 9:35 AM IST
Jio Effect : BSNL బంపర్ ఆఫర్ జూన్ 30 వరకూ పొడిగింపు... రోజుకు 2.21GB డేటా...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 4, 2019, 9:35 AM IST
జియో ఇంటర్నెట్ వచ్చాక... మొబైల్ ఆపరేటర్ల మధ్య పోటీ బాగా పెరిగింది. ఒకరికి మించి ఒకరు భారీ ఆఫర్లు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే... జియోను వెనక్కి నెట్టడం వాటి వల్ల కావట్లేదు. ఆ క్రమంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL జనవరి నుంచీ ఏప్రిల్ 30 వరకూ ప్రీపెయిడ్ సబ్ స్క్రైబర్ల కోసం అమల్లో ఉంచిన బంపర్ ఆఫర్‌ను ఇప్పుడు జూన్ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రోజుకు 2.21GB డేటా ఇచ్చే ఇలాంటి ఆఫర్‌ను సెప్టెంబర్ 2018లో కూడా ప్రకటించింది. అందువల్ల జూన్ 30 వరకూ ఈ ఆఫర్ కింద కస్టమర్లు రోజుకు 2.21 GB డేటా పొందగలరు. జియో పోటీని తట్టుకోవడానికే ఈ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు తెలిసింది.

రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ.999, రూ.1,699 ప్రీపెయిడ్ ప్లాన్స్‌ ఎంచుకున్న కస్టమర్లు... అదనంగా రోజూ 2.21GB డేటాను పొందగలరు. సవరించిన ప్లాన్ ప్రకారం యూజర్లు రూ.186, రూ.429 రీచార్జ్ ప్లాన్స్‌కి రోజూ 3.21GB డేటా పొందగలరు. అదే రూ.485, రూ.666 రిచార్జ్ ప్లాన్స్‌ తీసుకున్నవారు రోజుకు రూ.3.7GB డేటా పొందగలరు. ఈ ఆఫర్ లేకపోతే రోజుకు రూ.1.5GB మాత్రమే దక్కేది.

ఇక రూ.1,699 రీచార్జ్ ప్లాన్ పొందినవారు... బంపర్ ఆఫర్ కలిపి రోజుకు 4.21GB డేటాను పొందగలరు. ఇంతకుముందు బంపర్ ఆఫర్ లేకుండా 2జీబీ మాత్రమే వచ్చేది. పొడిగించిన ఆఫర్‌ను ప్రస్తుతం చెన్నై, తమిళనాడు సర్కిల్స్‌లో మాత్రమే అమల్లోకి తెస్తున్నారు. మిగతా రాష్ట్రాల సంగతేంటన్నది BSNL ఇంకా చెప్పలేదు.

 



ఇవి కూడా చదవండి :

గేమ్స్ ఆడుతుంటే పేలిన సెల్‌ఫోన్... ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం

కేబినెట్ కూర్పుపై జగన్ దృష్టి... తూర్పు గోదావరి జిల్లా నేతకు అత్యంత కీలక మంత్రి పదవి ?
Loading...
ఏపీలో రాజకీయ సంక్షోభం... టార్గెట్ చంద్రబాబు ? రాష్ట్రపతి పాలన తెస్తారా ?

కరెంటు షాక్ కొట్టిన కూలర్... ఆరేళ్ల చిన్నారి మృతి
First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...