హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఈ20 బ్లెండెడ్ పెట్రోల్ తయారు చేసిన Jio-bp

ఈ20 బ్లెండెడ్ పెట్రోల్ తయారు చేసిన Jio-bp

ఈ20 బ్లెండెడ్ పెట్రోల్ తయారు చేసిన Jio-bp
(ప్రతీకాత్మక చిత్రం)

ఈ20 బ్లెండెడ్ పెట్రోల్ తయారు చేసిన Jio-bp (ప్రతీకాత్మక చిత్రం)

Jio-bp | జియో-బీపీ నుంచి సరికొత్త పెట్రోల్ వచ్చేసింది. ఈ20 బ్లెండెడ్ పెట్రోల్‌ను తమ ఔట్‌లెట్లలో అందిస్తోంది జియో-బీపీ.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతదేశ మార్కెట్లోకి సరికొత్త పెట్రోల్ వచ్చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), bp ఫ్యూయెల్స్, మొబిలిటీ జాయింట్ వెంచర్ అయిన Jio-bp కొత్తగా ఈ20 పెట్రోల్‌ను (E20 Petrol) తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా, భారతదేశంలో E20 మిశ్రమ పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి ఇంధన రిటైలర్లలో జియో-బీపీ ఒకటిగా నిలిచింది. E20 పెట్రోల్ అనుకూల వాహనాలు ఉన్న వినియోగదారులు, Jio-bp ఔట్‌లెట్లలో ఈ ఇంధనాన్ని కొనొచ్చు. ప్రస్తుతం ఎంపిక చేసిన Jio-bp అవుట్‌లెట్‌లలో E20 పెట్రోల్ లభిస్తోంది. త్వరలో Jio-bp నెట్‌వర్క్‌లోని అన్ని ఔట్‌లెట్లలో E20 పెట్రోల్ లభిస్తుంది.

ఇరవై శాతం ఇథనాల్, ఎనభై శాతం శిలాజ ఆధారిత ఇంధనం మిశ్రమంతో E20 ఇంధనం తయారవుతుంది. భారతదేశ చమురు దిగుమతి ఖర్చు, ఇంధన భద్రత, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, మెరుగైన గాలి నాణ్యత, స్వావలంబన, దెబ్బతిన్న ఆహార ధాన్యాల వినియోగం, రైతుల ఆదాయం పెంచడం, ఉపాధి కల్పన, మరిన్ని పెట్టుబడి అవకాశాలను పెంచాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం పెట్రోల్‌లో E20 కలపాలని భారతదేశం నిర్ణయించింది.

Savings Account: మహిళలు ఈ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఉచితంగా 5 లక్షల ఇన్స్యూరెన్స్

ప్రభుత్వం E20 ఇంధన లక్ష్యాన్ని 2030 నుండి 2025 వరకు పెంచింది. ఇంధనం, మొబిలిటీ దిశగా భారతదేశ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే 20 ఏళ్లలో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్‌గా అవతరించనుంది. జియో-బిపి మొబిలిటీ స్టేషన్‌లు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడటానికి రూపొందించబడ్డాయి. కస్టమర్ సౌలభ్యం కోసం ఇవి ఆదర్శంగా సేవలందిస్తున్నాయి.

Tax Saving Tips: పన్ను ఆదా చేయడానికి 70 రకాల మినహాయింపులు, తగ్గింపులు

జియో-బీపీ ఔట్‌లెట్స్ ప్రయాణంలో వినియోగదారుల కోసం అనేక రకాల సేవలను అందజేస్తున్నాయి. సంకలిత ఇంధనాలు, EV ఛార్జింగ్, రిఫ్రెష్‌మెంట్‌లు, ఆహారం లాంటి సేవల్ని అందిస్తున్నాయి. కాలక్రమేణా మరింత తక్కువ కార్బన్ పరిష్కారాలను అందించడానికి జియో-బీపీ కలిసిపనిచేస్తున్నాయి.

First published:

Tags: Jio bp, Reliance, Reliance bp, RIL

ఉత్తమ కథలు