Gold Merchants: బంగారు వ్యాపారులకు ఊరట.. నవంబర్​ 30 వరకు వాటి గడువు పెంపు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మకచిత్రం

Gold Merchants: బంగారు ఆభరణాలకు హాల్​మార్కింగ్​(HallMarking) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీని అమలును పలుసార్లు వాయిదా వేసినప్పటికీ.. ఎట్టకేలకు ఆగస్టు(August) 31 నుంచి అమలు చేస్తామని చెప్పింది. మరో సారి దాని గడవును పెంచింది కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
బంగారు ఆభరణాలకు హాల్​మార్కింగ్​(HallMarking) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీని అమలును పలుసార్లు వాయిదా వేసినప్పటికీ.. ఎట్టకేలకు ఆగస్టు(August) 31 నుంచి అమలు చేస్తామని చెప్పింది. కాగా, ఈ కొత్త విధానాన్ని స్వర్ణకారులు(Jewelers), బంగారు వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. కొత్త నిబంధనలకు అలవాటు పడేందుకు మరింత సమయం కావాలని ఇటీవల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం హాల్​మార్కింగ్(Hallmarking) అమలును మరో మూడు నెలల పాటు వాయిదా వేసింది.

Organ Donation: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..

దీంతో, నవంబర్ 30 నుంచి హాల్​మార్కింగ్​ అమల్లోకి రానుంది. అసలు బంగారం హాల్​మార్కింగ్​ రూల్స్​ ఎలా ఉన్నాయి? వాటిని వ్యాపారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే విషయాలను తెలుసుకుందాం.

గోల్డ్ హాల్‌మార్కింగ్ రూల్స్​ ఇవే..
1. వార్షిక టర్నోవర్ రూ. 40 లక్షల వరకు ఉన్న నగల వ్యాపారులకు హాల్‌మార్కింగ్ నిబంధనల నుండి మినహాయింపునిచ్చారు.
2. భారత ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం నగల ఎగుమతి, దిగుమతికి హాల్​మార్కింగ్ తప్పనిసరి.

Income Source: ప్రతీ నెల రూ.200 పొదుపుతో.. రూ.28 లక్షల వరకు పొందొచ్చు.. వివరాలిలా..

3. అంతర్జాతీయ B2B దేశీయ ప్రదర్శనలకు తీసుకెళ్లే ఆభరణాలకు హాల్​మార్కింగ్ నుండి మినహాయింపు ఇచ్చారు.
4. 20, 23, 24 అదనపు క్యారెట్ల బంగారు ఆభరణాలకు సైతం హాల్‌మార్కింగ్ నిబంధన వర్తిస్తుంది.
5. గడియారాలు, ఫౌంటెన్ పెన్నులు, కుందన్, పోల్కి, జాడౌ వంటి ప్రత్యేక ఆభరణాలకు హాల్‌మార్కింగ్ నుండి మినహాయింపునిచ్చారు.
6. నగల వ్యాపారులు పాత బంగారు ఆభరణాలను కొనుగోలుదారు నుండి హాల్‌మార్క్ లేనప్పటికీ తిరిగి కొనుగోలు చేయవచ్చు.

Smart Air-purifier: భారతీయుల ప్రతిభ.. మొక్కతో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ తయారీ.. ఎలా పని చేస్తుందంటే? 

7. పాత ఆభరణాలను హాల్‌మార్క్ చేయవచ్చు. కరిగించి కొత్త నగలుగా తయారు చేసిన తర్వాత వాటిని హాల్​మార్కింగ్​ ధృవీకరణకు పంపించవచ్చు.
8. హాల్​మార్కింగ్ అమలులో తలెత్తే సమస్యలను పరిశీలించడానికి షేర్​ హోల్డర్స్​, రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులందరితో కలిసి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేస్తుంది

.Airlines: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే విమాన టికెట్.. ఎలా పొందాలంటే..

9. ప్రతి ఆభరణానికి హాల్​మార్కింగ్​ ఒకేసారి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఎటువంటి రుసుము వసూలు చేయదు. తయారీదారు, దిగుమతిదారు, హోల్‌సేలర్, డిస్ట్రిబ్యూటర్ లేదా రిటైలర్ విలువైన లోహ వస్తువులను విక్రయించడంలో తప్పనిసరిగా బీఐఎస్​లో నమోదు చేసుకోవాలి.
10. బంగారం తయారీదారు, హోల్ సేలర్, డిస్ట్రిబ్యూటర్ లేదా రీటైలర్ ఇలా ఎవరైనా కావచ్చు మొదటి విక్రేత వద్దే హాల్​ మార్కింగ్​ చేయాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published: