హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Motors: అదిరే ఫీచర్లతో టాటా సఫారీ, హారియర్, నెక్సాన్ కార్లకు జెట్ ఎడిషన్‌ లాంచ్.. ధరల వివరాలివే..

Tata Motors: అదిరే ఫీచర్లతో టాటా సఫారీ, హారియర్, నెక్సాన్ కార్లకు జెట్ ఎడిషన్‌ లాంచ్.. ధరల వివరాలివే..

Tata Nexon

Tata Nexon

Tata Motors: టాటా సఫారీ జెట్ ఎడిషన్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో 6-సీటర్, 7-సీటర్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పటికప్పుడు అద్భుతమైన కార్లను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కంపెనీ సఫారీ (Safari), హారియర్ (Harrier), నెక్సాన్ (Nexon) మోడల్ కార్ల జెట్ ఎడిషన్‌ (Jet Edition)ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. 'బిజినెస్ జెట్స్' నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ ఎడిషన్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో ప్రత్యేకమైన ఎక్స్‌టీరియర్, ఇన్‌టీరియర్ కలర్ థీమ్‌ను ఆఫర్ చేసింది. ఈ జెట్ ఎడిషన్ కార్లు టాటా మోటార్స్‌కి చెందిన అన్ని అథరైజడ్‌ డీలర్‌షిప్‌లలో ఇప్పటికిప్పుడే కొనుగోళ్లకు అందుబాటులోకి వస్తాయి.


టాటా సఫారీ జెట్ ఎడిషన్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో 6-సీటర్, 7-సీటర్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. XZ+ డీజిల్ 6-సీటర్ రూ. 21.45 లక్షలు కాగా XZA+ డీజిల్ 6-సీటర్ రూ. 22.75 లక్షలు... XZ+ డీజిల్ 7-సీటర్ రూ. 21.35 లక్షలు... XZA+ డీజిల్ 7-సీటర్ రూ.22.65 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.


ఇక టాటా హారియర్ జెట్ ఎడిషన్‌ మాన్యువల్ వేరియంట్ రూ.20.90 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్ రూ. 22.20 లక్షల ధరతో లాంచ్ అయ్యాయి. టాటా నెక్సాన్ జెట్ ఎడిషన్ నాలుగు వేరియంట్లలో విడుదలయ్యింది. వాటిలో నెక్సాన్ XZ+ (P) డీజిల్ ధర రూ.13.43 లక్షలు.. XZA+ (P) డీజిల్ ధర రూ.14.08 లక్షలు.. XZ+ (P) పెట్రోల్ ధర రూ.12.13 లక్షలు.. XZA+ (P) పెట్రోల్ ధర రూ.12.78 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరలన్నీ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలను గమనించాలి.ఈ మూడు ఎస్‌యూవీల జెట్ ఎడిషన్ ఎక్స్‌టీరియర్ అనేది స్టార్‌లైట్‌గా పిలిచే డ్యూయ‌ల్ టోన్ ఎర్తీ బ్రాంజ్‌, ప్లాటినమ్‌ సిల్వ‌ర్ రూఫ్‌తో విడుదలయింది. జెట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో వచ్చే ఈ ఎడిషన్ కార్లలో బ్యాక్ సిల్వర్ స్కిడ్ ప్లేట్లు అందించారు. క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఆయిస్టర్ వైట్ & గ్రానైట్ బ్లాక్ సీట్ల కవర్లతో కంప్లీట్ చేశారు. అలానే డోర్లు, ఫ్లోర్ కన్సోల్‌లపై బ్రాంజ్ యాక్సెంట్లు, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వద్ద టెక్నో-స్టీల్ బ్రాంజ్ ఫినిషింగ్ మిడ్-ప్యాడ్‌ను అమర్చారు. ముందు హెడ్‌రెస్ట్‌లపై #JET ఎంబ్రాయిడరీని, బ్రాంజ్ థ్రెడ్‌తో సీట్లపై డెకో స్టిచింగ్ అందించారు.


ఇది కూడా చదవండి : ఆ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ తేదీలోపు కేవైసీ చేయకపోతే మీ అకౌంట్స్ ఫసక్..


టాటా సఫారీ, టాటా హారియర్ జెట్ ఎడిషన్లు డ్రైవర్ డోజ్ ఆఫ్ అలర్ట్, పానిక్ బ్రేక్ అలర్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ బ్రేకింగ్ వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో వస్తాయి. ఈ రెండు ఎస్‌యూవీలలోని అన్ని వరుసలలో USB టైప్ C ఛార్జర్లు ఉంటాయి.


ఈ జెట్ ఎడిషన్ కార్లలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, రెండవ వరుస బెంచ్‌లో వింగ్డ్ కంఫర్ట్ హెడ్ రెస్ట్రెయింట్స్, కెప్టెన్ సీట్లు (సఫారీలో మాత్రమే), 4 డిస్క్ బ్రేక్‌లు, ఆటోమేటిక్ & మాన్యువల్‌లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా నెక్సాన్ జెట్ ఎడిషన్‌లో వెంటిలేటెడ్ సీట్లు, టిల్ట్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, AQi డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇచ్చారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Best cars, Cars, Tata cars, Tata Motors, Tata nexon

ఉత్తమ కథలు