హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jet Airways : జెట్ ఎయిర్ వేస్ పైలట్లకు బ్యాడ్ టైమ్...మరీ ఇంత చీప్ అయిపోయామా అంటూ ఆవేదన...

Jet Airways : జెట్ ఎయిర్ వేస్ పైలట్లకు బ్యాడ్ టైమ్...మరీ ఇంత చీప్ అయిపోయామా అంటూ ఆవేదన...

 జెట్ ఎయిర్ వేస్ పైలట్లను ఇతర ఏవియేషన్ సంస్థలు 30-50 శాతం తక్కువ వేతనాలకు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ లో నెలకు 4 లక్షల వేతనం పొందే ఇంజనీర్లను కేవలం రూ.లక్షన్నరకే ఆఫర్ ఇస్తున్నారు.

  అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ నుంచి బయటపడి వేరే జాబ్ కోసం ఎదురు చూస్తున్న పైలట్లు, ఎంత జీతానికైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు జెట్ ఎయిర్ వేస్ తో పోలిస్తే ఎంతో తక్కువ వేల్యూ ఉన్న స్పైస్ జెట్ లో కూడా పనిచేసేందుకు పైలెట్లు, సంస్థ ఇతర సిబ్బంది సిద్ధమైపోతున్నారు. అయితే జెట్ ఎయిర్ వేస్ పైలట్లను ఇతర ఏవియేషన్ సంస్థలు 30-50 శాతం తక్కువ వేతనాలకు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ లో నెలకు 4 లక్షల వేతనం పొందే ఇంజనీర్లను కేవలం రూ.లక్షన్నరకే ఆఫర్ ఇస్తున్నారు. అయితే ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కష్టాలు పడుతున్న జెట్ ఏయిర్ వేస్ సిబ్బంది. చేసేదేమి లేక చిన్న చిన్న ఎయిర్ లైన్స్ కంపెనీల్లో జాయిన్ అవుతున్నారు.

  ముఖ్యంగా స్పైస్ జెట్ సంస్థ ఎక్కువగా కొత్త సిబ్బందిని తీసుకునేందుకు ఆఫర్ ఇస్తోంది. అయితే జీతం తగ్గించుకుంటే వెంటనే ఆఫర్ ఇస్తామని కండీషన్ పెట్టడం గమనార్హం. అయితే స్పైస్ జెట్ మాత్రమే కాదు, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సైతం సీనియారిటీ ఆధారంగా జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

  అయితే ప్రస్తుతం తమ డిమాండ్ తక్కువగా ఉందని, తమ టైమ్ బ్యాడ్ ఉందని, అందుకే తక్కువ జీతమైనా పనిచేయకతప్పని పరిస్థితి ఉందని, జెట్ పైలట్లు వాపోతున్నారు. ఇదిలా ఉంటే జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది తమ సంస్థ నుంచి రావాల్సిన బాకీల కోసం వీలైతై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

  First published:

  Tags: Air India, Jet Airways, Shamshabad Airport, SpiceJet

  ఉత్తమ కథలు