దెబ్బ మీద దెబ్బ...మరింత ముదరుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ కష్టాలు

జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక కష్టాలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

news18-telugu
Updated: January 9, 2019, 12:07 PM IST
దెబ్బ మీద దెబ్బ...మరింత ముదరుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ కష్టాలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 9, 2019, 12:07 PM IST
ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ ఆర్థిక కష్టాలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో ప్రయాణీకుల సంఖ్య పెరిగినా...జెట్ ఎయిర్‌వేస్‌లో తగ్గింది. 2018  నవంబరు మాసంలో 14.7 లక్షల మంది ప్రయాణీకులు జెట్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణించారు. 2018 జనవరి మాసంతో పోల్చితే నవంబరు మాసంలో ప్రయాణీకుల సంఖ్య దాదాపు 1.5 లక్షలు తగ్గింది. 2018 జనవరిలో 16.2 లక్షల మంది ప్రయాణీకులు జెట్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణించినట్లు డీజీసీఏ గణాంకాల్లో తేలాయి. గత ఏడాదికాలంగానే జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణీకుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 2017 సంవత్సరంలో 16.1 లక్షల మంది ప్రయాణించారు. ఆ ఏడాది జనవరి మాసపు ప్రయాణీకుల సంఖ్యతో పోల్చితే 1.4 లక్షల మంది ఎక్కువగా ప్రయాణించారు.

2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసం నుంచి జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. 2018 మార్చి మాసంతో ముగిసిన త్రైమాసంలో జెట్ ఎయిర్‌వేస్ రూ.1,045 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,442 కోట్ల నిఖర లాభాన్జి ఆర్జించిన ఆ సంస్థ...2017-18 ఆర్థిక మాసంలో రూ.634 కోట్ల నష్టపోయింది.

ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థల్లో 2018 జనవరితో పోల్చితే నవంబరు మాసంలో ప్రయాణీకుల సంఖ్య పెరగడం విశేషం. ఇండిగో విమానాల్లో జనవరిలో 45.5 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించగా...నవంబరులో 50 లక్షల మంది ప్రయాణించారు. స్పైస్ జెట్ విమానాల్లో 2018 జనవరిలో 14.4 లక్షల మంది ప్రయాణించగా...నవంబరులో 14.5 లక్షల మంది ప్రయాణించారు.

అంతర్జాతీయ రూట్స్‌లోనూ జెట్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణీకుల సంఖ్య తగ్గారు. 2018 జనవరిలో 8.1 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించగా..2018 నవంబరు నాటికి 6.4 లక్షలకు తగ్గారు.

First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...