Jet Airways: జెట్ భారం తగ్గించుకునేందుకు ఎస్‌బీఐ నిర్ణయం... బిడ్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్..

జెట్ ఎయిర్ వేస్‌కు చెందిన ఈక్విటీ వాటాలను అమ్మడం ద్వారా బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఎస్బీఐ ప్రణాళిక వేసింది. వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అలాగే బిడ్లను దాఖలు చేసేందుకు ఏప్రిల్ 10న చివరితేదీగా నిర్ణయించారు.

news18-telugu
Updated: April 8, 2019, 4:30 PM IST
Jet Airways: జెట్ భారం తగ్గించుకునేందుకు ఎస్‌బీఐ నిర్ణయం... బిడ్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 8, 2019, 4:30 PM IST
జెట్ ఎయిర్ వేస్‌‌ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని ఎస్‌బీఐ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే దివాళా కోరల్లో ఉన్న జెట్ ఎయిర్ వేస్ బాధ్యతలను ఎస్బీఐ నెత్తిన వేసుకుంది. అయితే జెట్ ఎయిర్ వేస్‌కు చెందిన ఈక్విటీ వాటాలను అమ్మడం ద్వారా ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ప్రణాళిక వేసింది. వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అలాగే బిడ్లను దాఖలు చేసేందుకు ఏప్రిల్ 10న చివరితేదీగా నిర్ణయించారు. బ్యాంకుల కన్సార్షియానికి నాయకత్వం వహిస్తున్న ఎస్బీఐ ఇప్పటికే సంస్థ నిర్వహణకు రూ.1500 కోట్ల జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణ కోసం కేటాయించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే సంస్థ ఫౌండ్ ప్రమోటర్ నరేష్ గోయల్ అతని సతీమణి అనితా గోయల్ సంస్థ బోర్డు నుంచి వైదొలగడంతో వారి వాటా 25 శాతానికి పతనమైంది. కాగా బ్యాంకులకు జెట్ ఎయిర్ వేస్ నుంచి మొత్తం రూ.8000 కోట్ల బకాయాలు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆ మొత్తాన్ని ఈక్విటీ షేర్లుగా మార్చి ఆసక్తి ఉన్న బిడ్డర్లకు అప్పగించాలని బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. ఇప్పటికే కన్సార్షియం కనీసం 3.54 కోట్ల షేర్లను ఆఫర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అంటే మొత్తం వాటాలో ఇది 31.2 శాతంతో సమానం.

అలాగే బిడ్డర్లలో స్ట్రాటజిక్, అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు ఏవియేషన్ సెక్టారుకు చెందినవారు అయి ఉండాలని నిబంధన విధించారు. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా ఈక్విటీ ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజర్లను బిడ్ వేసేందుకు ఆహ్వానిస్తున్నారు.

First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...