Jet Airways: విజయ్ మాల్యాను నిలువునా ముంచిన వ్యాపారమే...ఈ బిజినెస్‌మ్యాన్‌ను కూడా మింగేసింది...

సరిగ్గా 7 సంవత్సరాల క్రితం కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా సైతం ఎయిర్ లైన్స్ వ్యాపారంలో చేతులు కాల్చుకొని అప్పుల్లో మునిగిపోయి ఏకంగా దేశం దాటి పారిపోయి నేరస్తుడిగా మిగలగా, ఇప్పుడు నరేష్ గోయల్ సైతం అప్పుల్లో కూరుకుపోయి నష్టాలతో నిష్క్రమించడం గమనార్హం..

news18-telugu
Updated: March 25, 2019, 6:57 PM IST
Jet Airways: విజయ్ మాల్యాను నిలువునా ముంచిన వ్యాపారమే...ఈ బిజినెస్‌మ్యాన్‌ను కూడా మింగేసింది...
సరిగ్గా 7 సంవత్సరాల క్రితం కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా సైతం ఎయిర్ లైన్స్ వ్యాపారంలో చేతులు కాల్చుకొని అప్పుల్లో మునిగిపోయి ఏకంగా దేశం దాటి పారిపోయి నేరస్తుడిగా మిగలగా, ఇప్పుడు నరేష్ గోయల్ సైతం అప్పుల్లో కూరుకుపోయి నష్టాలతో నిష్క్రమించడం గమనార్హం..
news18-telugu
Updated: March 25, 2019, 6:57 PM IST
అప్పుల్లో కూరుకుపోయి దివాళా అంచుల్లో నిలిచిన జెట్ ఎయిర్ వేస్ బోర్డు నుంచి సంస్థ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య తప్పుకున్నారు. గోయల్‌తో పాటు నామినీగా ఉన్న ఎతిహాద్ ఎయిర్‌వేస్ పీజేఎస్‌సీ కెవిన్ నైట్ సైతం బోర్డును బయటకు వచ్చేశారు. ఈ మేరకు జెట్ ఎయిర్ వేస్ కంపెనీ బోర్డు సమావేశం అనంతరం స్టాక్ మార్కెట్లకు సమాచారం అందించింది. కాగా రుణదాతల తరపున ఇద్దరు సభ్యులు బోర్డులో బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే బోర్డు సుమారు 11.4 కోట్ల ఈక్విటీ షేర్లను బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు కేటాయించడం జరిగింది. అలాగే ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రూ.1500 కోట్ల నిధులను వివిధ రుణ పద్ధతుల ద్వారా సేకరించేందుకు సిద్ధమవుతోంది.

jet airways, pilots, interview, spice jet, airways, mumbai ,KA, దివాలా తీసిన జెట్ ఎయిర్ వేస్, జెట్ ఎయిర్ వేస్, ఉద్యోగులు, దివాలా తీసిన, పైలట్లు, బోయింగ్ విమానాలు
ప్రతీకాత్మక చిత్రం


అలాగే మధ్యంతర మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామని తద్వారా కంపెనీ రోజువారీ వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తామని తెలిపింది. అలాగే రూ.1500 కోట్ల నిధులను సేకరించి రెండు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు దోహదపడుతుందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. అయితే ఈ నిధుల సేకరణకు ప్రతిఫలంగా కంపెనీలో రుణదాతలకు 51 శాతం వాటా లభిస్తుందని రజనీష్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే జెట్ భాగస్వామ్య కంపెనీ అయిన ఎతిహాద్ సంస్థ వాటా 25 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందని, అలాగే సంస్థ చైర్మన్ నరేష్ గోయల్ వాటా 25 శాతంగా ఉందని రజనీష్ తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి బిడ్లకు ఆహ్వానం పలుకనున్నారు. ఏప్రిల్ 30 బిడ్లకు తుది గడువుగా నిర్ణయించారు. కొత్త వాటా దారులు ఎవరైనా మే 31 లోగా బాధ్యతలు చేపట్టవచ్చని రజనీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా జెట్ ఎయిర్‌వేస్ లో ఫండింగ్ చేసే వారు ముందుకు వస్తే వారికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కలగవని హామీ ఇచ్చారు.



దేశంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన జెట్ ఎయిర్ వేస్ సంస్థ పాతికేళ్ల ప్రస్థానం, నరేష్ గోయల్ నిష్క్రమణతో ముగిసింది. మరోవైపు సుమారు 200 మంది పైలట్లు రాజీనామాకు సిద్ధమవడంతో పాటు, 23,000 మంది ఉద్యోగులు గత 3 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడటం గమనార్హం. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా సైతం ఎయిర్ లైన్స్ వ్యాపారంలో చేతులు కాల్చుకొని అప్పుల్లో మునిగిపోయి ఏకంగా దేశం దాటి పారిపోయి నేరస్తుడిగా మిగలగా, ఇప్పుడు నరేష్ గోయల్ సైతం అప్పుల్లో కూరుకుపోయి నష్టాలతో నిష్క్రమించడం గమనార్హం..
First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...