ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ సీఈవో రికార్డు.. ఆయన మాజీ భార్య కూడా..

తన భార్యకు విడాకుల భరణంగా నాలుగింట ఒక వంతు ఆస్తులు ఇచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఆయనే ప్రపంచ కుబేరుడు. తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టుకొని చరిత్ర సృష్టించారు బెజోస్.

news18-telugu
Updated: July 2, 2020, 9:49 PM IST
ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ సీఈవో రికార్డు.. ఆయన మాజీ భార్య కూడా..
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్
  • Share this:
ఇది కరోనా కాలం..! కరోనా భయం.. లాక్‌డౌన్ ప్రభావంతో.. అంతటా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఏకంగా దేశాల ఆర్థిక వ్యవస్థలే అస్తవ్యస్తమవుతున్నాయి. కరోనా సమమంలో అన్ని కంపెనీలు నష్టాలు చవిచూస్తున్నాయి. కుబేరుల ఆస్తులు కూడా కరిగిపోతున్నాయి. కానీ ఇంతటి కష్టకాలంలోనూ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆస్తులు భారీగా పెరిగాయి. అంతేకాదు తన భార్యకు విడాకుల భరణంగా నాలుగింట ఒక వంతు ఆస్తులు ఇచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఆయనే ప్రపంచ కుబేరుడు. తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టుకొని చరిత్ర సృష్టించారు బెజోస్.

కరోనా సమయంలోనూ అమెజాన్ షేర్లు 4.4 శాతం పెరిగి రికార్డు స్థాయి 2,879 డాలర్లకు చేరాయి. అందులో వాటా కలిగిన సీఈవో జెఫ్ బెజోస్ ఆదాయం 171.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. సెప్టెంబర్ 4, 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్లు. అప్పటికి నుంచి ఇప్పటి వరకు అదే రికార్డు. అంత ఆస్తిపాస్తులు ఎవరికీ లేవు. కానీ తాజాగా అమెజాన్ షేర్లు పెరగడంతో.. బెజోస్ ఆదాయం మరింత పెరిగి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇప్పుడు ఏకంగా 171.6 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు బెజోస్. అటు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ సంపద నికర విలువ కూడా 56.9 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్‌లో ఆమె 12వ స్థానాన్ని పొందారు. ప్రపంచంలో రెండవ సంపన్న మహిళగా అవ‌త‌రించారు.
First published: July 2, 2020, 9:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading