• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • JEFF BEZOS IS GOING TO SPACE NEXT MONTH THOUSANDS OF PEOPLE DONT WANT HIM TO COME BACK TO EARTH MK GH

Jeff Bezos: ‘జెఫ్ బెజోస్​.. నువ్వు మళ్లీ భూమికి తిరిగి రావొద్దు’.. అమెజాన్​ బాస్​పై ఆన్​లైన్ పిటిషన్లు

జెఫ్ బెజోస్

బెజోస్ అంతరిక్ష ప్రయాణ నేపథ్యంలో ఆసక్తికర ఆన్​లైన్ పిటిషన్​ వెలుగులోకి వచ్చింది. బెజోస్​ మళ్లీ భూమి మీదకు రావద్దని, స్పేస్​లోనే సెటిల్​ అవ్వాలని ఆ పిటిషన్​లో ఉంది. చేంజ్​ డాట్ ఓఆర్‌జీ (change.org) వెబ్​సైట్​లో ఈ పిటిషన్ అందుబాటులో ఉంది. దీనికి రకరకాల కారణాలతో వేలాది మంది మద్దతు తెలిపారు.

  • Share this:
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్ వచ్చే నెలలో అంతరిక్షానికి వెళ్లనున్నారు. తన స్పేస్ స్టార్టప్​ బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి దూసుకెళ్లనున్నారు. స్పేస్​ ఎక్స్​, వర్జిన్ గెలాక్టిక్​ మాదిరిగా అంతరిక్షానికి ప్రయాణికులకు పంపాలని స్పేస్ రైడ్​లకు పంపాలని బ్లూ ఆరిజిన్​ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తయారు చేసిన ఫ్లాగ్​షిప్ స్పేస్​క్రాఫ్ట్ న్యూషెపర్డ్​లో వ్యక్తిగతంగా తానే అంతరిక్షానికి ప్రయాణిస్తానని బెజోస్​ ప్రకటించారు. తన సోదరుడు, మరో వ్యక్తితో కలిసి ఈ ఏడాది జూలై 20న స్పేస్​కు వెళతానని ప్రకటించారు. అమెరికా వెస్ట్ టెక్సాస్​లోని గువాడలుపే పర్వతాల్లోని బ్లూ ఆరిజిన్​ లాంచ్ సైట్​ నుంచి బెజోస్ అంతరిక్షానికి ఎగరనున్నారు.

అయితే బెజోస్ అంతరిక్ష ప్రయాణ నేపథ్యంలో ఆసక్తికర ఆన్​లైన్ పిటిషన్​ వెలుగులోకి వచ్చింది. బెజోస్​ మళ్లీ భూమి మీదకు రావద్దని, స్పేస్​లోనే సెటిల్​ అవ్వాలని ఆ పిటిషన్​లో ఉంది. చేంజ్​ డాట్ ఓఆర్‌జీ (change.org) వెబ్​సైట్​లో ఈ పిటిషన్ అందుబాటులో ఉంది. దీనికి రకరకాల కారణాలతో వేలాది మంది మద్దతు తెలిపారు.

“జెఫ్ బెజోస్.. లెక్ లూథర్​ (ఓ నవలలోని కామెడీ విలన్​ క్యారెక్టర్​). మారు వేషంలో ఉన్న ఓ సూపర్ సక్సెస్​ఫుల్ వ్యాపార వేత్త. ప్రపంచం మొత్తంపై ఆయన చెడు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మొత్తం నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. ఆయన భూమి నుంచి దూరంగాపోయే మార్గం ఇదొక్కటే. ఆయన వెళ్లిపోయేలా మా ప్రభుత్వం కూడా మద్దతిస్తుంది” అని పిటిషన్​లో ఉంది. “వారు మైక్రోచిప్​లను ప్రారంభించి ప్రజలను తమ అదుపులోకి తెచ్చుకోకుండా తప్పించుకునేందుకు ఇదే చివరి అవకాశం” అంటూ సరదాగా ఈ పిటిషన్​ ముగిసింది. వారంలో ఈ పిటిషన్​పై 18వేల మందికిపైగా ఆన్​లైన్​లో సంతకాలు చేశారు. కాగా బెజోస్​ను మళ్లీ భూమికి మీదకు అనుమతించవద్దని నమోదైన మరో పిటిషన్​కు 25వేల మంది మద్దతిచ్చారు. ఇలా బెజోస్​ అంతరిక్ష ప్రయాణంపై సరదా పిటిషన్లు వస్తున్నాయి.

బ్లూ ఆరిజిన్​ ప్రాజెక్టులో భాగంగా న్యూ షెఫర్డ్​ స్పేస్​క్రాఫ్ట్​ లాంచ్​ మొదలయ్యాక 15 నిమిషాల్లోనే భూమికి 60 మైళ్లు ఎత్తుకు ప్రయాణికులను తీసుకెళుతుంది. ఆరుగురు ప్రయాణికులు కూర్చునేలా భూమికి 62 మైళ్లు (100 కిలోమీటర్లు) వరకు వెళ్లేలా ఈ న్యూ షెఫర్డ్​ను తయారు చేశారు. భూమ్యాకర్షణ శక్తి లేకుండా ఉండేందుకు ఈ ఎత్తు సరిపోతుంది. ఈ ప్రాజెక్టు అనంతరం చార్జీలను వసూలు చేసి ప్రయాణికులను అంతరిక్షంలోకి పంపాలని అమెజాన్​ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఎలాన్ మస్క్​కు చెందిన స్పేస్ ఎక్స్ కూడా తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.
Published by:Krishna Adithya
First published: