Jeff Bezos: అత్యంత ఆనందంగా అంతరిక్ష యానం చేసిన జెఫ్‌బెజోస్... ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరు. ఆయనపై యూజర్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఏం జరిగింది?
Jeff Bezos: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్... ఆమధ్య బ్లూఆరిజిన్ రాకెట్‌తో రోదసిలోకి వెళ్లివచ్చిన విషయం మనకి తెలుసు. ఈ యాత్ర ద్వారా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకున్నట్లు జెఫ్ బెజోస్ ఎంతో ఆనందపడ్డారు. కానీ... ఆ యాత్రే ఆయన కొంప ముంచుతోంది. ఈ యాత్ర విజయవంతంగా పూర్తయ్యాక... "ఇది సాధ్యమవ్వడానికి కారణం మీరే... మీరు చెల్లించిన పన్నుల ద్వారానే ఇది సాధ్యమైంది అంటూ... బెజోస్... అమెజాన్ ఉద్యోగులు, కస్టమర్లకు థాంక్స్ చెప్పారు. ఇది తెలిసిన వెంటనే అమెరికాలో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లు ఆయనపై మండిపడుతూ... ప్రైమ్ సబ్స్క్రిప్షన్లను రద్దు చేసుకుంటున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే... బెజోస్... ఈ అంతరిక్ష యానం చెయ్యడానికి ప్రధాన కారణం... అమెజాన్ కస్టమర్లు, సబ్స్క్రైబర్లు చెల్లించిన టాక్సులే. అవే లేకపోతే... ఆయన ఇంత సంపన్నుడు అయ్యేవాడు కాదు... ఇలా రోదసీయానం చేసేవాడు కాదు. ఇలా సిగ్గు లేకుండా తమ డబ్బుతో వెళ్లొచ్చారనే ఆగ్రహంతో ఉన్న సబ్స్క్రైబర్లు ఆయనపై మండిపడుతున్నారు.
this is somehow a real quote
Jeff Bezos: "I want to thank every Amazon employee, and every Amazon customer, because you guys paid for all this ... thank you from the bottom of my heart very much."pic.twitter.com/5JREV6Uha7
నిజానికి జెఫ్ బెజోస్ ఇలా చెప్పడం ద్వారా ప్రజలు తనను ఇంకా ఎక్కువగా మెచ్చుకుంటారని భావించారు. మీ వల్లే ఇది సాధ్యమైంది అని అంటే... ప్రజలు... మావల్లే ఇలా సాధ్యమైందని ఆనందపడతారని అనుకున్నారు. కానీ ప్రజలు అలా రిసీవ్ చేసుకోలేదు. తమ డబ్బుతో, అమెజాన్ ఉద్యోగుల డబ్బుతో బెజోస్ ఈ యాత్ర చేశారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అమెజాన్ సంస్థ తమ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. సమయానికి డెలివరీ పంపేలా చేసేందుకు కనీసం... యూరిన్‌కి వెళ్లేందుకు కూడా ఉద్యోగులకు టైమ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందనే వార్తలు భగ్గుమన్నాయి. ఉద్యోగులను బెజోస్... రాచిరంపాన పెడుతున్నారనే వార్తలు రావడంతో... బెజోస్... ఈ థాంక్యూ మెసేజ్ పంపారు. దాంతో... పుండుపై కారం చల్లినట్లైంది. ప్రజలకు ఆయనపై కోపం మరింత పెరిగింది.
ఇప్పుడు చాలా మంది అమెజాన్ సబ్స్క్రిప్షన్ వదిలేసుకొని... తాము చాలా మంచి పని చేశామని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. మిగతా వారు కూడా వదిలేసుకోమని కోరుతున్నారు. ఇదో ఉద్యమంలా సాగుతోంది.
జెఫ్ బెజోస్ జూలై 20న 11 నిమిషాల్లో అంతరిక్ష యాత్ర చేశారు. దీని కోసం రూ.206 కోట్లు ఖర్చు చేశారని అంచనా. ఈ యాత్ర తర్వాత ఆయన పలుకుబడి తగ్గింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు. బెజోస్ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గుడ్స్ సంస్థ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(LVMH) చీఫ్ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ పొందారు. ఆయన 200.5 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో ఉండగా... 190.7 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.