ఎలాంటి అవాంతరాలు లేకుండా పెన్షనర్లు(Pensioners) పెన్షన్ అందుకోవాలంటే తప్పనిసరిగా సమయానికి లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రం (జీవన్ ప్రమాణ్ పత్ర) అందజేయాలి. పెన్షనర్లు ప్రతి నవంబర్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. నెలవారీ పెన్షన్ అందుకోవడానికి బ్యాంకు, పోస్టాఫీసు లేదా పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు(PDA) లైప్ సర్టిఫికేట్‌ను అందజేయాలి. అయితే పెన్షనర్లు ఆఫీస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయవచ్చు. పెన్షనర్లు సాఫ్ట్వేర్ అప్లికేషన్, సెక్యూర్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జనరేట్ చేయవచ్చు. జనరేట్ అయిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(DLC) ఆన్లైన్లో స్టోర్ అవుతుంది. అవసరమైనప్పుడు PDA, పెన్షనర్ వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన వివిధ ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూద్దాం.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం పెన్షనర్ స్వయంగా పెన్షన్ డిస్బర్సింగ్ అధికారి ముందు హాజరు కానవసరం లేదు. భౌతికంగా పెన్షన్ పంపిణీ ఏజెన్సీకి (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ మొదలైనవి) సమర్పించాల్సిన అవసరం లేదు. ఇది వారికి డిజిటల్‌గా అందుబాటులో ఉంటుంది. పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది. ప్రతి డిజిటల్ సర్టిపికేట్కు ప్రమాణ్ ఐడీ ప్రత్యేకంగా ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్లు
లైఫ్ సర్టిఫికేట్ కోసం పెన్షనర్ల ఆధార్ నంబర్, పేరు, మొబైల్ నంబర్, పీపీఓ నంబర్, పెన్షన్ అకౌంట్ నంబర్, బ్యాంక్ వివరాలు, పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ , పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ పేరు వంటి వివరాలు అవసరం. పెన్షనర్ తప్పనిసరిగా బయోమెట్రిక్స్ ఐరిస్ లేదా ఫింగర్ప్రింట్లను అందించాలి.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అర్హత
జీవణ్ ప్రమాణ్‌లో ఆన్‌బోర్డ్ అయిన పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీకి సంబంధించిన పెన్షనర్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. అయితే తిరిగి ఉద్యోగంలో చేరిన లేదా మరో వివాహం చేసుకున్న పెన్షనర్ జీవన్ ప్రమాణ్‌కు అర్హులు కాదు. వారు తమ పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీకి సాధారణ పద్ధతిలోనే లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయాల్సి ఉంటుంది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆమోదించారా? లేదా? ఎలా తెలుసుకోవాలి?
స్టేటస్ తెలుసుకోవడానికి జీవన్ ప్రమాణ్ పోర్టల్ నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
జీవన్ ప్రమాణ్ తిరస్కరిస్తే ఏం చేయాలి?
పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీని సంప్రదించాలి. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జనరేట్ చేసేటప్పుడు పెన్షనర్ తప్పు వివరాలను అందిస్తే జీవన్ ప్రమాణ్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. సరైన సమాచారం అందజేసి మళ్లీ జీవన్ ప్రమాణ్‌ను జనరేట్ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్‌ను పొందడానికి ఆధార్ నంబర్ లేదా VID తప్పనిసరి.
ప్రమాణ్ ID/జీవన్ ప్రమాణ్ వ్యాలిడిటీ
ప్రమాణ్ ID/జీవన్ ప్రమాణ్ వ్యాలిడిటీ జీవితాంతం ఉండదు. అది చెల్లుబాటు అయ్యే వ్యవధి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ పేర్కొన్న నిబంధనల ప్రకారం ఉంటుంది. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత, కొత్త జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.