భారత ప్రభుత్వం పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను (Life Certificate) అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు తమ పెన్షన్‌ను (Pension) డ్రా చేసుకోవడానికి ప్రతి సంవత్సరం తమ లైఫ్ సర్టిఫికేట్(జీవన్ ప్రమాణ్ లేదా జీవన ప్రమాణ పత్రం)ను పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ (PDA)కి సమర్పించాలి. పెన్షనర్ జీవించే ఉన్నారని నిర్ధారించేందుకు, అవకతవకలకు అవకాశం లేకుండా ఈ డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. పెన్షనర్లు సాఫ్ట్వేర్ అప్లికేషన్, సెక్యూర్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జనరేట్ చేయవచ్చు.
అయితే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే ప్రక్రియను సులభతరం చేయడానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వీడియో లైఫ్ సర్టిఫికేట్(VLC) సర్వీసును లాంచ్ చేసింది. పెన్షన్ ప్రాసెస్ అయిన పెన్షనర్లు ఇప్పుడు వీడియో లైఫ్ సర్టిఫికేట్ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. వారి లైఫ్ సర్టిఫికేట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాప్ లేదా వెబ్సైట్ నుంచి వీడియో కాల్ ద్వారా సమర్పించవచ్చు. ఈ లేటెస్ట్ సర్వీసును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
వెబ్సైట్, యాప్ నుంచి ఇలా..
మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక PensionSeva వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లేదా PensionSeva మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో వెబ్‌పేజీ టాప్‌లో ఉన్న ‘వీడియోఎల్సీ(VideoLC)’ లింక్‌పై క్లిక్ చేయాలి. యాప్‌లో అయితే 'వీడియో లైఫ్ సర్టిఫికేట్(Video Life Certificate)' ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ పెన్షన్ అకౌంట్ నంబర్, క్యాప్చా ఎంట్ చేసి.. ఆధార్ వివరాలను యాక్సెస్ చేసేలా బ్యాంక్‌కు అధికారం ఇచ్చే చెక్ బాక్స్‌ను సెలక్ట్ చేయాలి. అనంతరం ‘వ్యాలిడేట్ అకౌంట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీన్ని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేయాలి.
రూ.140 పొదుపుతో రూ.21 లక్షలు.. మీ పిల్లల్ని ధనవంతుల్ని చేయండిలా!
ఆ తర్వాత అవసరమైన సర్టిఫికేట్లను సమర్పించి, కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో.. వీడియో కాల్ కోసం అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడానికి సంబంధించిన సూచనలు అనుసరించాలి. దీనికి సంబంధించి SMS, ఇమెయిల్‌కు కన్ఫర్మేషన్ వస్తుంది.
ఈ షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులు వీడియో కాల్లో జాయిన్ అవ్వాలి. బ్యాంక్ అధికారికి కాల్లో వెరిఫికేషన్ కోడ్‌ను చదివి వినిపించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్‌ను కూడా చూపించాలి. వెరిఫికేషన్ తర్వాత బ్యాంక్ అధికారి పెన్షనర్ ముఖాన్ని క్యాప్చర్ చేయడానికి కెమెరాను స్థిరంగా ఉంచుకోవాలి.
ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, సమాచారం రికార్డ్ అయినట్లు కన్ఫర్మేషన్ పెన్షనర్‌కు వస్తుంది. వీడియో లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ కూడా పెన్షనర్లకు SMS ద్వారా తెలియజేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Life certificate, Pensions, Sbi, State bank of india