హోమ్ /వార్తలు /బిజినెస్ /

Life Certificate: లైఫ్‌ సర్టిఫికేట్‌ అందించేందుకు ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.. ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయండిలా..

Life Certificate: లైఫ్‌ సర్టిఫికేట్‌ అందించేందుకు ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.. ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పుడు పెన్షనర్లు 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల డోర్‌స్టెప్ బ్యాంకింగ్ అలయన్స్ లేదా పోస్టల్ డిపార్ట్‌మెంట్ డోర్‌స్టెప్ సర్వీస్‌ని ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

​​పెన్షనర్లు ఇకపై లైఫ్‌ సర్టిఫికేట్‌ (Life Certificate) అందజేయడానికి ఆఫీస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే వృద్ధులు డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ (Digital Life Certificate) ను ఫైల్‌ చేయవచ్చు. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు యాన్యువల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా 2022 నవంబర్ 30లోపు సమర్పించాలి. ఇందుకు పెన్షనర్లకు బయోమెట్రిక్ సపోర్టు డిజిటల్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఆధార్ ఎనేబుల్డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికేట్‌ని జనరేట్‌ చేయవచ్చు. ఇప్పుడు పెన్షనర్లు 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల డోర్‌స్టెప్ బ్యాంకింగ్ అలయన్స్ లేదా పోస్టల్ డిపార్ట్‌మెంట్ డోర్‌స్టెప్ సర్వీస్‌ని ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. లైఫ్‌ సర్టిఫికేట్ మాన్యువల్‌గా లేదా డిజిటల్‌గా సమర్పించడానికి అందుబాటులో ఉన్న మార్గాలు ఇవే..

డోర్‌స్టెప్ బ్యాంకింగ్

దేశంలోని 100 ప్రధాన నగరాల్లో డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌లను సేకరించే సేవను PSB అలయన్స్ అందుబాటులోకి తెచ్చింది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ అలయన్స్ ద్వారా లైఫ్‌ సర్టిఫికేట్‌ అందజేయవచ్చు. ఇందులో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఈ సర్వీస్ అందించడానికి ఒక DSB ఏజెంట్ పెన్షనర్ ఇంటి వద్దకు వస్తారు. పెన్షనర్ మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్‌ సహా అందుబాటులో ఉన్న మూడు ఛానెల్‌లలో దేనినైనా ఉపయోగించి సర్వీస్ రిజర్వ్ చేసుకోవచ్చు. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (DSii) యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా, పెన్షనర్లు https://doorstepbanks.com/&https://dsb.imfast.colin/doorstep/lfigin లింక్‌ లేదా, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 18001213721, 18001037188ల ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.

7th Pay Commission: పెన్షనర్లకు అలర్ట్... పెరిగిన డీఆర్ వర్తించేది వీరికే

జీవన్ ప్రమాణ్ పోర్టల్

పెన్షనర్లు తమ యాన్యువల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఇందుకు జీవన్ ప్రమాణ్ యాప్‌ను పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పెన్షనర్ తప్పనిసరిగా UIDAI మ్యాండేటెడ్‌ ఎక్విప్‌మెంట్‌ ఉపయోగించి ఫింగర్‌ప్రింట్స్‌ సమర్పించాలి. ఫింగర్‌ప్రింట్స్‌ డివైజ్‌ను ఫోన్‌కి లింక్ చేయడానికి OTG కేబుల్‌ని ఉపయోగించవచ్చు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)

2020 నవంబర్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ & పెన్షన్‌నర్స్ వెల్ఫేర్ పోస్ట్‌మ్యాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి డోర్‌స్టెప్ సర్వీస్ ప్రారంభించింది. దీనిని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అభివృద్ధి చేసింది. మొబైల్ ద్వారా ఈ ఫంక్షన్‌ను ఉపయోగించడానికి పెన్షనర్ తప్పనిసరిగా Postinfo యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. https://youtu.be/eERwM U7g54లో పోస్ట్‌మెన్/గ్రామిన్ డాక్ సేవక్స్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే విధానాన్ని చూడవచ్చు.

అధికారి సంతకం చేసిన సర్టిఫికేట్‌ను ఎలా సమర్పించాలి?

సంబంధిత అధికారి సంతకం చేసిన సర్టిఫికేట్‌ను సమర్పించేందుకు పెన్షనర్‌ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. CPAO-జారీ చేసిన స్కీమ్ బుక్‌లెట్‌లోని పేరా 14.3 ప్రకారం మినహాయింపు ఉంది.

పోస్ట్‌మ్యాన్

2020 నవంబర్‌లో పోస్ట్‌మ్యాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు పోస్ట్‌ల శాఖ డోర్‌స్టెప్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి, పెన్షనర్ పోస్ట్‌ఇన్ఫో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఫేస్ అథెంటికేషన్

UIDAI ఆధార్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ సిస్టమ్‌ని ఉపయోగించి, పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌లను సబ్మిట్‌ చేయవచ్చు. పెన్షనర్ లైవ్ ఫోటో తీసి జీవన్ ప్రమాణ్ మొబైల్ అప్లికేషన్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్రియేట్‌ అవుతుంది.

First published:

Tags: Life certificate, Pensioners

ఉత్తమ కథలు