హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jeep Meridian: ఇండియాలో జీప్ మెరిడియన్‌ SUV లాంచ్.. ప్రారంభ ధర రూ.29 లక్షలు.. స్పెసిఫికేషన్లు ఇవే..

Jeep Meridian: ఇండియాలో జీప్ మెరిడియన్‌ SUV లాంచ్.. ప్రారంభ ధర రూ.29 లక్షలు.. స్పెసిఫికేషన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టెల్లాంటిస్‌ గ్రూప్‌ సంస్థ జీప్‌ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ మెరిడియన్‌ను భారత మార్కెట్లలోకి విడుదల చేసింది. ఇది అయిదు వేరియంట్లలో లభించనుంది. పరిచయ ఆఫర్‌లో భాగంగా మెరిడియన్‌ ప్రారంభ ధరల శ్రేణిని రూ.29.9- 36.95 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

స్టెల్లాంటిస్‌ గ్రూప్‌(Group) సంస్థ జీప్‌ ఇండియా(Jeep India) సరికొత్త ఎస్‌యూవీ(SUV) మెరిడియన్‌ను భారత మార్కెట్లలోకి(Indian Market) విడుదల చేసింది. ఇది అయిదు వేరియంట్లలో(Varients) లభించనుంది. పరిచయ ఆఫర్‌లో(Offer) భాగంగా మెరిడియన్‌ ప్రారంభ ధరల శ్రేణిని రూ.29.9- 36.95 లక్షలుగా (Ex Showroom))గా నిర్ణయించారు.

* మెరిడియన్ వేరియంట్లు- ధరలు

MT FWD వేరియంట్- రూ.29.90 లక్షలు

(O) MT FWD వేరియంట్ - రూ 32.40 లక్షలు

9AT FWD వేరియంట్ - రూ. 31.80 లక్షలు

(O) 9AT FWD - రూ. 34.30 లక్షలు

(O) 9AT 4×4 వేరియంట్ ధర - రూ 36.95లక్షలు

* మెరిడియన్ స్పెసిఫికేషన్స్

మెరిడియన్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్లను కంపాస్‌తో పోల్చవచ్చు. అదనపు వరుస సీట్లకు అనుగుణంగా భారీ ట్వీక్‌లతో ఉంటుంది. కొలతల పరంగా చూస్తే కంపాస్ కంటే మెరిడియన్ 41mm వెడల్పు, 48mm పొడవు ఉంటుంది. వీల్‌బేస్ కూడా 146 మిమీ విస్తరించి ఉంటుంది. మెరిడియన్ సరికొత్త గ్రాండ్ చెరోకీ ఎల్‌తో సమానంగా ఉండే లేటెస్ట్ బాడీ ప్యానెల్‌లతో వస్తుంది. ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ కంపాస్ నుండి స్ఫూర్తిని పొందింది. ఇది కొత్త బ్రౌన్ కలర్ ఆప్షన్‌తో వస్తుంది.

* ఫీచర్లు

మెరిడియన్ వెహికల్ 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లతో రానుంది. జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ESC, హిల్ స్టార్ట్ అండ్ డీసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరాతో పాటు ఆప్షన్ డ్రైవ్ మోడ్‌లతో మెరిడియన్లు పవర్డ్ టెయిల్‌గేట్ ఫంక్షన్‌తో అందుబాటులోకి రానున్నాయి.

Traffic Rule: కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేశాయి... హెల్మెట్ విషయంలో ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్

కంపాస్ మాదిరిగానే, మెరిడియన్ కూడా 170hp, 350Nm, 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ మల్టీజెట్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. మూడు వరుసల్లో మొత్తం ఏడు సీట్లు ఉండే మెరిడియన్‌ ఎస్‌యూవీలో 6-స్పీడ్‌ మాన్యువల్‌, 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం, మెరిడియన్ మధ్య వరుసకు బెంచ్ సీటు... మూడో వరుస యాక్సెస్ కోసం ఒక-టచ్ టంబుల్ డౌన్ ఫంక్షన్‌తో మొత్తంగా 7-సీటర్‌గా అందుబాటులో ఉంది. బెంచ్ సీట్లకు బదులుగా మధ్య వరుసలో కెప్టెన్ సీటు ఉండే 6-సీటర్ వేరియంట్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా, మెరిడియన్‌ ఎస్‌యూవీ బుకింగ్‌లను కంపెనీ ఇటీవల ప్రారంభించింది. జీప్‌ ఇండియా షోరూమ్స్ లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.50,000 ముందస్తుగా చెల్లించి వినియోగదార్లు మెరిడియన్‌ను బుక్‌ చేసుకోవచ్చు. జూన్‌లో వాహన డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. మహారాష్ట్ర రంజన్‌గావ్‌లోని సంస్థ తయారీ ప్లాంట్‌లో మెరిడియన్‌ ఉత్పత్తి ఇప్పటికే మొదలైనట్లు సమాచారం.

First published:

Tags: Auto, Indian market, Jeep, Launch app

ఉత్తమ కథలు