Home /News /business /

JEEP COMPASS SUV GETS YEAR END DISCOUNTS WORTH UP TO RS 3 LAKH FOR DECEMBER MK GH

Jeep Compass: జీప్ కంపాస్ కారుపై భారీ తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఆఫర్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Jeep Compass: ప్రస్తుతం Jeep సంస్థ కూడా తమ లగ్జరీ SUV అయిన Jeep Compass మోడల్‌పై మంచి ఆఫర్లను ప్రకటించింది. దేశంలోని అన్ని Jeep డీలర్‌షిప్‌లలో డిసెంబర్ 31 వరకు తగ్గింపులు ఉన్నాయి.

కరోనా ఆటోమొబైల్ ఇండస్ట్రీని బాగా దెబ్బతీసింది. Lockdown వల్ల దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలను కొన్ని నెలల వరకు మూసివేశారు. కొనేవారు కూడా లేకపోవడంతో కార్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత sales కొంతమేరకు పెరిగాయి. పండుగ సీజన్‌ సందర్భంగా ప్రకటించిన ఆఫర్లు, డిస్కౌంట్లతో వివిధ సంస్థలు రికార్డు స్థాయిలో అమ్మకాలను పెంచుకున్నాయి. ఆ తరువాత ఆఫర్లను డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించాయి. ప్రస్తుతం Jeep సంస్థ కూడా తమ లగ్జరీ SUV అయిన Jeep Compass మోడల్‌పై మంచి ఆఫర్లను ప్రకటించింది. దేశంలోని అన్ని Jeep డీలర్‌షిప్‌లలో డిసెంబర్ 31 వరకు తగ్గింపులు ఉన్నాయి. ఆఫర్ల జాబితాలో cash discounts, exchange bonus, complementary accessories, loyalty bonus వంటివి ఉన్నాయి.

ఆ ఫీచర్లు ప్రత్యేకం
Jeep Compass వాహనం 2.0-litre multijet diesel engineతో లభిస్తుంది. డ్యుయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్క్ అసిస్ట్ సెన్సార్లు, సైడ్ కర్టెన్లు, ముందువైపు కూర్చునేవారి కోసం సీట్-మౌంటెడ్ సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్‌... వంటి ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. జీప్ కంపాస్ వాహనాన్ని కొనాలనుకునేవారు రూ.1.8 లక్షల వరకు క్యాష్‌ డిస్కౌంట్, రూ.50 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.50,000 విలువైన యాక్సెసరీలు, రూ.20,000 లాయల్టీ బోనస్ పొందవచ్చు.

ఆ మోడల్‌ కూడా..
Jeep సంస్థ Compass facelift ఎడిషన్‌ను కూడా అభివృద్ది చేస్తోంది. కొన్ని పోర్టళ్లలో కారు టెస్ట్‌ మోడల్స్‌ కనిపిస్తున్నాయి. చైనా స్పెక్‌ మోడల్‌ ఫేస్‌లిఫ్ట్‌ కారును 2020 Guangzhou Auto Showలో ఆవిష్కరించారు. ఇండియన్ స్పెక్స్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే సంవత్సరం ఈ కారు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకు ముందు విడుదల చేసిన కార్ల మాదిరిగానే Jeep Compass facelift కూడా కనిపిస్తోంది. కానీ దీని పొడవును 29మిల్లీమీటర్లు, ఎత్తును 17 మిల్లీమీటర్ల వరకు పెంచారు. దీని వీల్‌బేస్ పాత మోడళ్ల మాదిరిగానే ఉంది. LED DRL హెడ్‌ల్యాంప్‌లు, మార్పులు చేసిన ఫ్రంట్ బంపర్ వంటివి ఆకట్టుకునేలా ఉన్నాయి. Jeep Compassకు కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌గా విడుదల చేయనున్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Automobiles, CAR, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు