Home /News /business /

JEEP COMPASS AVAILABLE AT DISCOUNTS UPTO RS 1POINT 5 LAKH IN JAN ADDITIONAL BENEFITS FOR WOMEN MK GH

Jeep Compass Offer: ఒకటిన్నర లక్షల డిస్కౌంట్.. మహిళా కస్టమర్లకు మరిన్ని స్పెషల్ డిస్కౌంట్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అదరగొట్టే SUVపై ఊరించే ఆఫర్ అంటే అది కూడా సంక్రాంతికి ఇంతకంటే పెద్ద గుడ్ న్యూస్ ఏముంటుంది...

ఆఫ్ రోడ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ జీప్ అంటే ఆటోమొబైల్ లవర్స్ కి ప్రత్యేకమైన అభిమానం. గత కొన్ని రోజులుగా Jeep Compassపై భారీ ఆఫర్లు ఊరిస్తున్నాయి. అన్ని జీప్ షోరూముల్లో ఈ ఆఫర్లు కస్టమర్లను భారీగా ఆకట్టుకుంటుండగా తాజాగా మరో ప్రకటన చేసింది జీప్ సంస్థ. సుమారు ఒకటిన్నర లక్షల వరకు ఆఫర్లను ప్రకటించిన జీప్, మహిళలకు అదనపు బెనిఫిట్లు ప్రకటించటం మరో హైలైట్. వుమెన్ బయ్యర్స్ ను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ఈ ఆఫర్లను ఇస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎస్ యూవీలపై ఎక్కువ మంది మహిళలు ఆసక్తి చూపుతుండటంతో జీప్ ఈ కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. ఈనెలాఖరు వరకు అంటే 2021 జనవరి మాసాంతం వరకు ఈ ఆఫర్ ఉంటుంది. కంపాస్ ప్రీమియంపై (Compass premium) భారీ ఆఫర్ ప్రకటించిన జీప్ త్వరలో జీప్ కంపాస్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ (facelift version) ను లాంచ్ చేయనుంది. ఇటీవలే కొత్త జీప్ మోడల్ ను ఆవిష్కరించిన కంపెనీ.. పాత స్టాక్ ను క్లియర్ చేయటంలో భాగంగా ఈ ఆఫర్ ను ప్రకటించింది.

మహిళా కస్టమర్లకు ఆఫర్

ఈ American SUV brand లో అదనపు బెనిఫిట్ కావాలనుకునే మహిళా కస్టమర్లు మీ దగ్గర్లోని జీప్ షోరూంను సందర్శించండి. డిస్కౌంట్లో భాగంగా క్యాష్ బెనిఫిట్, ఈఎంఐ స్కీముల్లో డిస్కౌంట్ పొందవచ్చు. జీప్ కంపాస్ సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం 22,823 రూపాయల ఈఎంఐ చెల్లిస్తే చాలు. దీంతోపాటు హైబ్రిడ్ ఈఎంఐ ఆప్షన్ ను కూడా సంస్థ ప్రకటించింది. కావాలంటే వరుసగా 3 నెలల పాటు 50శాతం కంటే తక్కువ ఈఎంఐ చెల్లించవచ్చు లేదా ఈఎంఐల సంఖ్య పెరిగేకొద్దీ ఎక్కువ మొత్తాన్ని ఈఎంఐగా చెల్లించవచ్చు. ఇలా ఎన్నినెలలు తాము చెల్లించాలనుకుంటే అన్ని నెలలను కస్టమర్లే ఎంపిక చేసుకునే విధానం కూడా జీప్ అందుబాటులోకి తెచ్చింది.

5 ట్రిమ్స్ లో కొత్త వర్షన్

గత నెల్లో ఫేస్ లిఫ్ట్ వర్షన్ జీప్ కంపాస్ ను ఆవిష్కరించిన సంస్థ 5 ట్రిమ్స్ లో కొత్త మోడల్స్ విడుదల కానున్నట్టు వెల్లడించింది. స్పోర్ట్స్ ప్లస్, లాంగిట్యూడ్ ఆప్షన్, లిమిటెడ్ ప్లస్, నైట్ ఈగిల్, ట్రైల్ హాక్ అనే మోడల్స్ లో ఇవి లాంచ్ కానున్నాయి. కొత్త మోడల్ ఫిబ్రవరి నుంచి రోడ్లపై పరుగులు పెట్టించాలన్న యోచనలో ఉన్న జీప్ సంస్థ ఇందుకు తగ్గట్టే క్లియరెన్స్ సేల్స్ మొదలుపెట్టింది. ప్రస్తుతమున్న 1.4 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ తోపాటు పాటు 160Bhp-250Nm, 2.0 లీటర్ టర్బో డీజిల్ యూనిట్ విత్ 170Bhp-350Nm కొత్త మోడల్ లో ఉండనున్నాయి. డీజిల్ వేరియంట్ కార్లలో 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే 3 గేర్ బాక్సెస్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ ట్విన్ క్లచ్ ఆటోమేటిక్ గా ఫేస్ లిఫ్ట్ అయిన జీప్ కంపాస్ మోడల్ సరికొత్తగా కనిపించనుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Automobiles, CAR, Cars

తదుపరి వార్తలు