SBI Bike Loan | మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా కొత్తగా బైక్ కొనే వారికి తీపికబురు అందించింది. జావా బైక్స్‌ను ఇక సులభంగానే కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బీఐ ఈ బైక్స్ కొనుగోలుకు కస్టమర్లకు రుణాలు (Loan) అందించనుంది. దీని కోసం జావా యెజ్డీ కంపెనీ తాజాగా స్టేట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా జావా బైక్స్ కొనే వారికి ఎస్‌బీఐ రుణాలు అందించనుంది.
ఇండియన్ మార్కెట్‌లో టూవీలర్ అమ్మకాలు పెంచుకోవాలనే లక్ష్యంతో జావా యెజ్డీ కంపెనీ ఇప్పుడు ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా జావా బైక్స్‌పై ఆకర్షణీయ ఫైనాన్స్ స్కీమ్స్ లభించనున్నాయి. దేశవ్యాప్తంగా జావా ఎస్‌బీఐ భాగస్వామ్యం అమలులో ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా మీరు జావా బైక్‌ను ఎస్‌బీఐ లోన్ సాయంతో కొనుగోలు చేయొచ్చు. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది.
రైతులకు మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్.. అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు?
జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ సీఈవో అశిశ్ సింగ్ జోషి మాట్లాడుతూ.. ఎస్‌బీఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల తమ ఛానల్ పార్ట్‌నర్స్, కస్టమర్లకు వివిధ రకాల ఫండింగ్, ఫైనాన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. దీని వల్ల కస్టమర్లకు జావా బైక్స్, సులభంగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అందువల్ల జావా బైక్స్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవచ్చు.
కంపెనీ బంపరాఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.20 వేల తగ్గింపు!
ఇకపోతే జావా యెజ్డీ కంపెనీ మన దేశంలో పలు రకాల మోడళ్లను అందుబాటులో ఉంచింది. జావా స్టాండర్డ్, జావా 42, జావా 42 బాబర్, జావా పెరక్, యెజ్డీ అడ్వెంచర్, యెజ్డీ స్క్రాంబ్లర్, యెజ్డీ రోడ్‌స్టెర్ వంటి మోడళ్లను అందిస్తోంది. ఈ మోడళ్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు పోటీ ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్లకు కూడా డిమాండ్ పెరిగింది. మరీముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరు మీద ఉన్నాయి. అందువల్ల మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఓలా, ఏథర్, ప్యూర్ ఈవీ వంటి పలు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. రూ. 20 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండీ ఈజీ ఫైనాన్స్ కూడా లభిస్తోంది. జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Bikes, Jawa, Sbi, State bank of india