Jawa Motorcycles: పాక్​పై యుద్ధం గెలిచి 50 ఏళ్లు పూర్తి.. గుర్తుగా జావా నుంచి రెండు కొత్త బైక్స్ విడుదల

Jawa Motorcycles

జావా క్లాసిక్​ బైక్​ ఇకపై ఖాకీ, మిడ్​నైట్​ గ్రే అనే రెండు కొత్త కలర్​ ఆప్షన్లలో లభించనుంది.1971లో పాకిస్థాన్​తో జరిగిన యుద్ధంలో భార?

  • Share this:
ఐకానిక్​ టూవీలర్​ బ్రాండ్​ జావా మోటార్స్​​ నుంచి రెండు కొత్త రంగుల్లో స్పెషల్​ ఎడిషన్​ బైక్​లు విడుదలయ్యాయి. దీంతో జావా క్లాసిక్​ బైక్​ ఇకపై ఖాకీ, మిడ్​నైట్​ గ్రే అనే రెండు కొత్త కలర్​ ఆప్షన్లలో లభించనుంది.1971లో పాకిస్థాన్​తో జరిగిన యుద్ధంలో భారత్​ విజయం సాధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా రెండు కొత్త కలర్​ ఆప్షన్లలో బైక్​ మోడళ్లను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. యుద్దంలో తిరుగులేని పోరాటం కొనసాగించిన భారత సైనిక దళాలకు గుర్తింపుగా ఖాకీ, మిడ్​నైట్​ గ్రే కలర్లలో వీటిని తీసుకొచ్చింది. వీటి ఇంధన ట్యాంకులపై మువ్వన్నెల జెండాతో పాటు ఇండియన్​ ఆర్మీ సింబల్​ను ముద్రించింది. ‘1971 యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 1971–2021’ అని చిహ్నం కింద రాయడం విశేషం. ఈ చిత్రంలో ఇన్సిగ్నియాతో కూడిన స్మారక చిహ్నం, 1971 విజయాన్ని సూచించే ‘లారెల్ దండ’ వంటివి చేర్చింది. ఈ చిహ్నాన్ని బైక్ ఇంధన ట్యాంక్ మధ్యలో త్రివర్ణ చారల వృత్తంలో జతచేసింది.

ఈ రెండు బైక్​లు భారత మార్కెట్​లో రూ. 1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జావా డీలర్​షిప్​ సెంటర్లలో ఇవి లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ స్పెషల్ ఎడిషన్​ జావా క్లాసికల్ బైక్​లలో ప్రవేశపెట్టిన ఖాకీ, మిడ్​నైట్​ గ్రే రంగులు రెండూ మ్యాట్​ ఫినిష్​తో వస్తాయి. ఇవి ఆల్​ బాక్​ థీమ్స్​ను కలిగి ఉంటాయి. ఈ బైక్​లో బ్లాక్ అవుట్​ స్పెక్​ ఇమ్స్​ని కూడా ఉపయోగించింది. తద్వారా బైక్​ మొత్తం డిజైన్​, లుక్​ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ బైక్​ సీట్లను కూడా కంపెనీ రీడిజైన్​ చేసింది. కొత్త సీట్లు రైడర్​కు మరింత సౌకర్యాన్ని కలుగజేస్తాయని కంపెనీ తెలిపింది.

అట్రాక్టివ్​ డిజైన్​, లుక్​తో..
జావా క్లాసిక్​ బైక్స్​లోని ఈ కొత్త కలర్​ ఆప్షన్లు డ్యుయల్​ ఏబిఎస్​ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ స్పెషల్ ఎడిషన్​ జావా క్లాసిక్​ బైక్​లో ఇంజిన్​ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. పాత డిజైన్​లో ఉపయోగించిన 293సిసి లిక్విడ్​ కూల్డ్​, సింగిల్ సిలిండర్​ ఇంజిన్​నే కొత్త ఎడిషన్​లోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్​ గరిష్టంగా 27.33 బిహెచ్​పి పవర్​, 27.02 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్​ స్పీడ్​ గేర్​ బాక్స్​తో వస్తుంది.
Published by:Krishna Adithya
First published: