Jawa Electric Bike: జావా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది... లీకైన స్పెసిఫికేషన్ల వివరాలివే

Jawa Electric Bike: జావా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది... లీకైన స్పెసిఫికేషన్ల వివరాలివే

Jawa Electric Bike | జావా ఎలక్ట్రిక్ బైక్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ బైక్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

  • Share this:
ఓవైపు పెట్రోల్, డీజిల్​ ధరలు ఆకాశన్నంటుతుండటం, మరోవైపు పర్యావరణ కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. దీంతో దాదాపు అన్ని ఆటోమొబైల్​ సంస్థలు ఎలక్ట్రిక్​ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. తాజాగా ఈ జాబితాలో రెట్రో మోడ్రన్​ బైక్​ తయారీ సంస్థ జావా కూడా చేరింది. జావా నుంచి 2022 ప్రారంభంలో ఆల్-ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల కానుంది. దీనికి సంబంధించిన వివరాలు ఆన్​లైన్​లో లీక్ అయ్యాయి. ఈ కొత్త జీరో-ఎమిషన్ బైక్​ మార్కెట్లో లభించే ఇతర జావా బైకులతో సమానమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ బైక్ బ్యాటరీ ప్యాక్ సాధారణ పెట్రోల్​ ట్యాంకు క్రింద ఉండే పెద్ద ఎన్​క్లోజ్​ కేసింగ్‌లో వస్తుంది. అయితే, ఛార్జింగ్ పోర్ట్, ఇతర ఎలక్ట్రిక్ భాగాలు ట్యాంక్ పైభాగంలో ఉండే అవకాశం ఉంది.

SBI New Feature: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... వెంటనే ఈ ఫీచర్ వాడుకోండి

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌ను తక్కువ అంచనా వేయొద్దు... కోటీశ్వరులు కావొచ్చు ఇలా

ఈ ఎలక్ట్రిక్​ బైక్​ డిజైన్​, స్ట్రక్చర్​ మొత్తం జావా 42 మోడల్​ను పోలి ఉంటుందని తెలుస్తోంది. దీని హ్యాండిల్ బార్, ఫుట్‌పెగ్ వంటివి బైక్​ను నిటారుగా ఉండేలా చేస్తాయి. దీనిలోని లార్జ్​ బ్యాటరీ ప్యాక్ క్విక్​ ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తుంది. ఇది బైక్‌ను మరింత ఎక్కువ దూరం కంఫర్ట్​గా ప్రయాణించేలా చేస్తుంది.

Rs 15 lakh prize money: మోదీ ప్రభుత్వం అద్భుత అవకాశం... రూ.15,00,000 గెలుచుకోండి ఇలా

New Rules from August 1: అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

2022 చివరి నాటికి మార్కెట్​లోకి


వచ్చే ఏడాది చివరి నాటికి ఈ నూతన ఎలక్ట్రిక్ బైక్ భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు దీనిపై జావా సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. జావా సంస్థ ఎలక్ట్రిక్ మోటారు విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. దీనిలో భాగంగా జావా తన యెజ్డి బ్రాండ్‌ను తిరగి పునరుద్దరిస్తుందని ఊహాగానాలు వినిపించాయి. ఈ బ్రాండ్​ నుంచి దసరా, దీపావళి పండుగ సీజన్​లో బైక్‌ భారత మార్కెట్​లోకి రానుంది. ఈ బైక్​ను జావా డీలర్‌షిప్‌ సెంటర్లలో విక్రయించనున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న 300 సిసి బైక్.. డిఓహెచ్‌సి లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పాటు సిక్స్ గేర్ బాక్స్‌తో వస్తుందని గాడివాలా.కామ్ నివేదిక తెలిపింది. భారతదేశంలో ఆటోమొబైల్​ బిజినెస్​ కోసం జావా ఇటీవల మహీంద్రా అండ్​ మహీంద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Published by:Santhosh Kumar S
First published: