Jawa Motorcycle: ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు... రూ.5,555 ఈఎంఐతో ఈ బైక్ మీ సొంతం

Jawa Motorcycle | జావా మోటార్ సైకిల్ బీఎస్6 మోడల్స్‌ని ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది.

news18-telugu
Updated: August 7, 2020, 6:56 PM IST
Jawa Motorcycle: ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు... రూ.5,555 ఈఎంఐతో ఈ బైక్ మీ సొంతం
Jawa Motorcycle: ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు... రూ.5,555 ఈఎంఐతో ఈ బైక్ మీ సొంతం
  • Share this:
మోటార్ సైకిల్ కొనాలనుకునేవారి కోసం జావా సరికొత్త ఆఫర్స్ ప్రకటించింది. హైదరాబాద్‌ మార్కెట్లోకి జావా, జావా ఫార్టీ టూ బీఎస్ 6 మోడల్స్ వచ్చేశాయి. అన్ని జావా డీలర్‌షిప్స్ దగ్గర ఈ కొత్త మోటార్ సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అసలే కరోనా సంక్షోభ కాలం. కొత్త వాహనాలు కొనాలంటే కాస్త కష్టమే. అందుకే కస్టమర్ల కోసం మూడ స్కీమ్స్ ప్రకటించింది కంపెనీ. స్కీమ్ 1 ఎంచుకుంటే మొదటి మూడు నెలలు 50% ఈఎంఐ చెల్లిస్తే చాలు. రెండో స్కీమ్‌ ఎంచుకుంటే స్పెషల్ ఈఎంఐ స్కీమ్‌లో భాగంగా రూ.5,555 ఈఎంఐ చెల్లించాలి. ఇక మూడో స్కీమ్‌లో అయితే రెండేళ్లకు రూ.8,000 ఈఎంఐ చొప్పున, మూడేళ్లకు రూ.6,000 ఈఎంఐ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏ స్కీమ్ ఎంచుకున్నా డౌన్‌పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. 100% ఫండింగ్ ఇస్తుంది కంపెనీ. ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా అవసరం లేదు.


ఇక జావా, జావా ఫార్టీ టూ విశేషాలు చూస్తే 293సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్, డీఓహెచ్‌సీ ఇంజిన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలోనే మొదటిసారి క్రాస్ పోర్ట్ టెక్నాలజీ ఉంది. క్రాస్ పోర్ట్ కాన్ఫిగ్యురేషన్ వాడుతున్న ప్రపంచంలోనే మొదటి సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇది. దీంతో పాటు లాంబ్డా సెన్సార్ మానిటర్స్ కూడా ఉన్నాయి. ధరల విషయానికొస్తే జావా మోటార్ సైకిల్ ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ.1,73,164, జావా ఫార్టీ టూ మోటార్ సైకిల్ ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ.1,60,300 నుంచి ప్రారంభం అవుతుంది. జావా మోటార్ సైకిల్ బ్లాక్, గ్రే, మెరూన్ కలర్స్‌లో లభిస్తే, జావా ఫార్టీ టూ మోటార్ సైకిల్ హ్యాలీస్ టీల్, కోమెట్ రెడ్, గలాక్టిక్ గ్రీన్, నెబ్యులా బ్లూ, ల్యూమోస్ లైమ్, స్టార్‌లైట్ బ్లూ కలర్స్‌లో లభిస్తాయి.
Published by: Santhosh Kumar S
First published: August 7, 2020, 6:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading