JANUARY 2022 CAR OFFERS ON RENAULT KIGER DUSTER TRIBER AND KWID MK
Car Discounts Offer: Renault కార్లపై 40 వేల దాకా తగ్గింపు..బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ మీ కోసం..
Car Discounts Offer: Renault కార్లపై 40 వేల దాకా తగ్గింపు..బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ మీ కోసం..
రెనాల్ట్ ఇండియా నుంచి ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కిగర్, ట్రైబర్, క్విడ్ , డస్టర్ వంటి మొత్తం 4 మోడళ్లను విక్రయిస్తోంది. రెనాల్ట్ కొత్త సంవత్సరంలో తన భారతీయ లైనప్పై భారీ తగ్గింపులను అందిస్తోంది. తాజా ఆఫర్ కిగర్ పై కూడా కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందజేస్తున్నారు.
ప్రస్తుత పాండెమిక్ యుగంలో కారు అనేది లగ్జరీ కాదు నిత్యవసరంగా మారిపోయింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడటం ద్వారా వైరస్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది పర్సనల్ వెహికిల్స్ వాడుతున్నారు. అయితే ఈ విభాగంలో కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బ్యాంకులు సైతం అతి తక్కువ వడ్డీ రేట్లకే కార్ల రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ వారు సైతం కార్లను కొనుగోలు చేయడం సులభం అవుతోంది. అంతేకాదు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లపై పలు డిస్కౌంట్ ఆఫర్స్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా మీ జేబుపై భారం తగ్గించుకోవచ్చు. రెనాల్ట్ ఇండియా నుంచి ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కిగర్, ట్రైబర్, క్విడ్ , డస్టర్ వంటి మొత్తం 4 మోడళ్లను విక్రయిస్తోంది. రెనాల్ట్ కొత్త సంవత్సరంలో తన భారతీయ లైనప్పై భారీ తగ్గింపులను అందిస్తోంది. తాజా ఆఫర్ కిగర్ పై కూడా కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందజేస్తున్నారు. కొత్త సంవత్సరం మొదటి నెలలో రెనాల్ట్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు మంచి డీల్ అనే చెప్పాలి.
రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)
రెనాల్ట్ క్విడ్ ప్రస్తుతం రూ. 35,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ , రైతులకు ప్రత్యేక ఆఫర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ నెలలో క్విడ్ను కొనుగోలు చేస్తే రూ. 10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్ తోపాటు, స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
రెనాల్ట్ కిగర్ (Renault Kiger)
రెనాల్ట్ కిగర్ గత నెలలో భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్ ఇదే. ఈ కారుపై రూ. 10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్ , రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber)
ఈ నెలలో రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపై రూ. 40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ పథకంలో రైతులకు ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అయితే VIN 2021 మోడల్ని కొనుగోలు చేస్తే రూ. 30,000 తగ్గుతుంది. ఇది కాకుండా స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 లాయల్టీ బోనస్ , రూ. 10,000 ప్రయోజనం కూడా పొందవచ్చు.
రెనాల్ట్ డస్టర్ (Renault Duster)
రెనాల్ట్ డస్టర్ పై రూ.1.10 లక్షల విలువైన ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలు పొందుతాయి. రూ. 1.30 లక్షల ముందస్తు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.