HOME »NEWS »BUSINESS »january 2021 bank holidays list banks will close 10 days in next month know why ss

January 2021 Bank Holidays: జనవరిలో బ్యాంకులకు సెలవుల లిస్ట్ ఇదే

January 2021 Bank Holidays: జనవరిలో బ్యాంకులకు సెలవుల లిస్ట్ ఇదే
January 2021 Bank Holidays: జనవరిలో బ్యాంకులకు సెలవుల లిస్ట్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

January 2021 Bank Holidays | జనవరిలో బ్యాంకులకు మొత్తం 10 సెలవులు ఉన్నాయి. ఏఏ రోజున బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    బ్యాంకుల్లో లావాదేవీలు జరిపేవారికి అలర్ట్. జనవరిలో పండుగలు, ఇతర వేడుకల కారణంగా బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. బ్యాంకుల్లో తరచుగా లావాదేవీలు జరిపేవారు తప్పనిసరిగా ఈ సెలవుల గురించి తెలుసుకోవడం అవసరం. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో ముందుగానే ప్రకటిస్తుంది. వచ్చే ఏడాదిలో ఎన్ని సెలవులు ఉంటాయో ముందటి ఏడాదిలోనే ప్రకటిస్తుంది. ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. ప్రధాన పండుగల్లో దేశమంతా సెలవులు ఒకేలా ఉంటాయి. కానీ స్థానిక పండుగలకు మాత్రం ప్రాంతాలవారీగా సెలవులు ఉంటాయి. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌‌లో రాష్ట్రాల వారీగా సెలవుల జాబితా ఉంటుంది. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌లో ఈ సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు. మరి 2021 జనవరిలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

    Doorstep Banking Services: ఈ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు



    HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయొచ్చు ఇలా

    January 2021 Bank Holidays: జనవరిలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే


    జనవరి 1- న్యూ ఇయర్ డే (శుక్రవారం)
    జనవరి 3- ఆదివారం
    జనవరి 9- రెండో శనివారం
    జనవరి 10- ఆదివారం
    జనవరి 14- మకర సంక్రాంతి (గురువారం)
    జనవరి 17- ఆదివారం
    జనవరి 23- నాలుగో శనివారం
    జనవరి 24- ఆదివారం
    జనవరి 26- రిపబ్లిక్ డే (మంగళవారం)
    జనవరి 31- ఆదివారం

    Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా

    EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు

    జనవరిలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు వస్తున్నాయి. అందులో 5 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. వీటితో పాటు న్యూ ఇయర్ డే, మకర సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా సెలవులు వచ్చాయి. బ్యాంకులకు వెళ్లే ముందు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకోండి.
    Published by:Santhosh Kumar S
    First published:December 26, 2020, 10:22 IST