హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Rates: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన 2 బ్యాంకులు..

FD Rates: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన 2 బ్యాంకులు..

FD Rates: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన 2 బ్యాంకులు..

FD Rates: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన 2 బ్యాంకులు..

Bank News | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా రెండు బ్యాంకులు కస్టమర్లకు తీపికబురు అందించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Fixed Deposit | బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి తీపికబురు. తాజాగా రెండు బ్యాంకులు కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి. దీంతో బ్యాంక్‌లో (Bank) డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక రాబడి వస్తుంది.

డీసీబీ బ్యాంక్ తాజాగా రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచేసింది. ఫిబ్రవరి 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్లకు 2.5 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 2.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ వస్తుంది. 376 రోజుల నుంచి 600 రోజుల ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది.

కారు కొంటే రూ.72,000 డిస్కౌంట్.. మారుతీ, టాటా, హోండా కార్లపై ఆఫర్ల వర్షం!

7 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.5 శాతంగా ఉంది. 8 రోజుల నుంచి 60 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.75 శాతంగా వస్తోంది. 61 రోజుల ఎఫ్‌డీలపై 3.25 శాతం వడ్డీ, 62 రోజుల నుంచి 180 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ 3 శాతంగా ఉంది. 181 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.75 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది నుంచి 375 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. 376 రోజుల నుంచి 600 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. 601 రోజుల నుంచి పదేళ్ల వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది.

రూ.100 పొదుపుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి వెళ్లొచ్చు

అలాగే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచే రేట్ల పెంపు వర్తిస్తుంది. బ్యాంక్ 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 3.75 శాతం నుంచి 8.1 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 4.45 శాతం నుంచి 8.8 శాతం వరకు వడ్డీ వస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. 181 రోజుల నుంచి 5 ఏళ్ల వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 8.2 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు అన్నీ వరుస పెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి.

First published:

Tags: Bank, Banks, FD rates, Fixed deposits, Money, Personal Finance, Small finance banks

ఉత్తమ కథలు