డబ్బులు బ్యాంకులో దాచుకోవడం, అవసరం అయినప్పుడు డబ్బులు డ్రా చేయడం మామూలే. డబ్బులు డ్రా చేయాలంటే అకౌంట్‌లో డబ్బులు ఉండాలి. కానీ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా రూ.10,000 డ్రా చేయొచ్చు. దీన్నే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ (Overdraft Facility) అంటారు. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అకౌంట్‌హోల్డర్స్ అందరికీ ఉండదు. ఎక్కువగా లావాదేవీలు జరిపేవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జన్ ధన్ అకౌంట్ (Jan Dhar Account) ఉన్నవారికి కూడా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం ఉంది. ఈ సదుపాయంపై అకౌంట్‌హోల్డర్లలో అవగాహన తక్కువగా ఉంది. జన్ ధన్ అకౌంట్ ఉన్నవారు తమ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా రూ.10,000 వరకు డ్రా చేయొచ్చు.
కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు కూడా బ్యాంకింగ్ సేవల్ని అందించడమే లక్ష్యంగా 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకాన్ని ప్రారంభించింది. అసలు బ్యాంకింగ్ సేవల గురించి తెలియనివారికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం, అందులో డబ్బులు దాచుకునేలా ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. ఇక ప్రభుత్వం అందించే ఇతర పథకాలకు చెందిన డబ్బుల్ని కూడా ఈ అకౌంట్ నుంచే లబ్ధిదారులకు చేరుస్తోంది కేంద్ర ప్రభుత్వం.
Upper Berth: రైలులో అప్పర్ బెర్త్ బుక్ చేసుకున్నారా? ఈ రూల్స్ మీకు తెలుసా?
జన్ ధన్ అకౌంట్ సాధారణ సేవింగ్స్ అకౌంట్. బేసిక్ అకౌంట్‌లో ఉండే ప్రయోజనాలన్నీ ఈ అకౌంట్‌లో ఉంటాయి. జన్ ధన్ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. బ్యాంకుల్లో ఇతర సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. జన్ ధన్ అకౌంట్‌కు మినిమమ్ బ్యాలెన్స్ రూల్ వర్తించదు. అంటే అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.
జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసినవారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డ్ లభిస్తుంది. ఇదే కార్డుపై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. జన్ ధన్ అకౌంట్‌హోల్డర్లు రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. అంటే అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా రూ.10,000 వరకు డ్రా చేయొచ్చు. ఇది లోన్ లాంటిది. అంటే మీరు ఓవర్‌డ్రాఫ్ట్ ద్వారా ఎంత డ్రా చేస్తారో, తిరిగి అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
SBI Safety Tips: యాప్‌లో లోన్ తీసుకుంటున్నారా? ఈ 6 టిప్స్ పాటించమంటున్న ఎస్‌బీఐ
దాదాపు అన్ని బ్యాంకుల్లో జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో జన్ ధన్ ఖాతా తెరవొచ్చు. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి, కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తే చాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Jan dhan account, Jan dhan yojana, Personal Finance, Pradhan Mantri Jan Dhan Yojana