Jaguar-Land Rover: ప్లాస్టిక్ లేకుండా కార్ల తయారీ... జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంచలనం

Jaguar-Land Rover | బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంచలనం ప్లాస్టిక్ వాడకుండా కార్లను తయారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

news18-telugu
Updated: September 30, 2020, 2:27 PM IST
Jaguar-Land Rover: ప్లాస్టిక్ లేకుండా కార్ల తయారీ... జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంచలనం
Jaguar-Land Rover: ప్లాస్టిక్ లేకుండా కార్ల తయారీ... జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంచలనం (ప్రతీకాత్మక చిత్రం, Image: Reuters)
  • Share this:
ప్లాస్టిక్ ప్ర‌జ‌ల జీవ‌న విధానంలో ఒక భాగంగా మారింది. ఈ సింథటిక్ పాలిమర్ ఎన్నో ర‌కాల కాలుష్యాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. శిలాజ ఇంధనాల వంటి సహజ వ‌న‌రులు, కార్బన్ సంబంధిత‌ మూలకాలను ఉపయోగించి వివిధ పాలిమర్‌లను త‌యారు చేస్తున్నారు. తేలికైన, సులభమైన‌ ఆకారంలో ఉండే ఈ పదార్థం వినియోగం పెరుగుతూనే ఉంది. ప్లాస్టిక్ లేని ప్రపంచాన్ని మనం ఇప్పుడు ఊహించలేం. ప్లాస్టిక్ వాడకం, వినియోగం ఎక్కువ అవుతున్నా కొద్దీ, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్నారు. ఇవి పర్యావరణ వ్యవస్థను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ను నిషేధించాల‌ని దేశాలు నిర్ణ‌యించాయి. దీంతో చాలా సంస్థ‌లు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, వాటి స్థానంలో బయో డిగ్రేడబుల్ పదార్థాలను అభివృద్ధి చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కార్ల త‌యారీ సంస్థ‌లు కూడా చేరాయి.

New Rules: అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

SBI ATM: ఏటీఎంలో డబ్బులు రాలేదా? అకౌంట్‌లో డెబిట్ అయ్యాయా? ఇలా చేయండి

ప్లాస్టిక్ వ‌ద్దంటున్న‌ ల్యాండ్ రోవ‌ర్


త‌మ కార్ల త‌యారీలో ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో త‌యారు చేసిన బ‌యో డిగ్రేడ‌బుల్ ప‌దార్థాల‌ను వాడుతామ‌ని బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్ర‌క‌టించింది. భవిష్యత్తులో విడుద‌ల చేయ‌నున్న‌ వాహనాల్లో స‌స్టెయిన‌బుల్ లెద‌ర్ను వాడుతామ‌ని తెలిపింది. సముద్రాల్లో, భూమి మీద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మంచి నాణ్యత ఉండే ఇంటీరియర్‌లను అభివృద్ధి చేస్తామ‌ని పేర్కొంది. ఇందుకోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ECONYL నైలాన్ను ఉప‌యోగించ‌నుంది.

స‌రికొత్త నైలాన్ ఉత్ప‌త్తులు


సింథటిక్ ఫైబర్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్గా పేరొందిన‌ ఆక్వాఫిల్ సంస్థ Econyl నైలాన్ను అభివృద్ధి చేసింది. రీసైకిల్ చేసిన పారిశ్రామిక ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, దుస్తుల‌ తయారీ సంస్థ‌ల నుంచి వ‌చ్చే ఫాబ్రిక్ వేస్ట్‌, ఆక్వాకల్చర్ పరిశ్రమ నుంచి ఫిషింగ్ నెట్ పదార్థాలు, సముద్రపు అడుగుభాగంలో పేరుకుపోయిన‌ ఫిషింగ్ నెట్స్ ల‌ను ఉప‌యోగించి ఈ కొత్త నైలాన్ను ఉత్పత్తి చేస్తున్నారు. సేక‌రించిన వాటిని రసాయన చ‌ర్య‌ల ద్వారా ముడి పదార్థాన్ని త‌యారు చేస్తారు. దుస్తులు, స్పోర్స్ట్ వేర్‌, వాచ్ పట్టీల ఉత్పత్తిలో కూడా దీన్ని ఉప‌యోగిస్తారు.Bank Holidays October 2020: అక్టోబర్‌లో బ్యాంకులకు 8 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

JioPostpaid Plus: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్స్ మీకోసమే

బై ప్రొడ‌క్ట్స్ కూడా రీసైక్లింగ్ చేస్తారు


ఈ ప్రక్రియలో బై ప్రొడ‌క్టులుగా ల‌భించే నాన్-నైలాన్, మెటాలిక్ మెటీరియల్స్, కాప‌ర్‌ సల్ఫేట్ వంటి వాటిని వేరు చేసి, రీసైక్లింగ్ కోసం ఇత‌ర సంస్థ‌ల‌కు పంపుతామ‌ని జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ చెబుతోంది. కాప‌ర్‌ సల్ఫేట్ను చేప‌ల వ‌ల‌ల‌పై స‌ముద్ర‌పు నాచు పెర‌గ‌కుండా ఉప‌యోగిస్తారు. త‌మ వినియోగ‌దారుల ల‌గ్జ‌రీ అనుభ‌వాన్ని ఎప్ప‌టికీ కాప‌డ‌తామ‌ని ఆ సంస్థ చెబుతోంది. ఇందుకోస‌మే అక్వాఫిల్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని తెలిపింది. ప‌ర్యావ‌ర‌ణంపై అంత‌గా ప్ర‌భావం చూప‌ని ఎకోనైల్ వాడ‌కం ద్వారా కాలుష్యంపై త‌మ వంతు పోరును కొన‌సాగిస్తామ‌ని ల్యాండ్ రోవ‌ర్ పేర్కొంది.
Published by: Santhosh Kumar S
First published: September 30, 2020, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading