Jaguar 2021 XF sedan: 2021 ఎక్స్ఎఫ్ సెడాన్​ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్​ను లాంచ్​ చేసిన జాగ్వార్​.. ధర చూస్తే షాకవ్వాల్సిందే!

Jaguar

జాగ్వార్‌ భారతదేశంలో '2021 ఎక్స్ఎఫ్ లగ్జరీ సెడాన్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఈ కారు ధరను కూడా ప్రకటించింది. 2021 ఎక్స్ఎఫ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూ.71.60 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకువచ్చింది.

  • Share this:
టాటా గ్రూప్‌కు చెందిన వాహన తయారీ సంస్థ 'జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌' విలాసవంతమైన కార్లను తయారు చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. జాగ్వార్‌ బ్రాండ్ నేమ్ తో రిలీజ్ అయిన లగ్జరీ కార్లు ఇప్పటికే రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ క్రమంలో కార్‌మేకర్ జాగ్వార్‌ భారతదేశంలో '2021 ఎక్స్ఎఫ్ లగ్జరీ సెడాన్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఈ కారు ధరను కూడా ప్రకటించింది. 2021 ఎక్స్ఎఫ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూ.71.60 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకువచ్చింది. దీని ధర రూ. 76 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 2021 ఎక్స్ఎఫ్ లగ్జరీ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. దీనిపెట్రోల్ ఆర్-డైనమిక్ ఎస్ వేరియంట్​ ధర రూ. 71.60 లక్షలు, డీజిల్ ఆర్-డైనమిక్ ఎస్ ధర రూ. 76 లక్షలుగా నిర్ణయించారు. ఫేస్‌లిఫ్ట్ సెడాన్ వెలుపలి భాగంలో కొన్ని మార్పులను చేశారని స్పష్టమవుతోంది. ఫ్రంట్ గ్రిల్ వెడల్పుగా క్రోమ్ ఫినిష్ తో అద్భుతంగా కనిపిస్తోంది. ముందు భాగంలో ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు కారుకు స్టైలిష్​లుక్​​ను అందిస్తాయి.ముందు బంపర్‌లోని ఎయిర్ ఇన్‌లెట్‌లు ఇప్పుడు గాలి ప్రవాహాన్నిపెంచడానికి వైడర్ ఓపెనింగ్‌తో వస్తాయి. జాగ్వార్ 2021 ఎక్స్ఎఫ్ అల్లాయ్ వీల్స్, సన్నని టెయిల్ ల్యాంప్‌లతో వస్తుంది.

ఇవి చదవండి.. Xiaomi: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి త్వరలోనే Electric Car విడుదల...

బీఎండబ్ల్యూ, వోల్వో, మెర్సిడెస్‌లకు పోటీగా..

ఈ లగ్జరీ సెడాన్​ వెహికిల్​ బీఎండబ్ల్యూ, వోల్వో, మెర్సిడెస్​ బెంజ్​కు చెందిన లగ్జరీ కార్లు గట్టి పోటీనివ్వనుంది. ఇక దీనిలోని ఫీచర్ల విషయానికి వస్తే..2021 ఎక్స్ఎఫ్ సెడాన్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 247 బీహెచ్‌పీ శక్తిని, 365ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కేవలం 6.5 సెకన్లలో సున్నా నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.గరిష్టంగా 250 kmph స్పీడ్​తో ప్రయాణించలదు.జాగ్వార్ ఎక్స్ఎఫ్ బీఎస్6 డీజిల్ వెర్షన్‌కూడా గతంలో విడుదలైంది. అయితే, కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా దీని అమ్మకాలను నిలిపివేశారు. ఇది 201 బీహెచ్‌పీ పవర్, 430ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇవి చదవండి.. Top electric scooters in india 2021: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..టాప్ 5 చాయిస్ ఇవే...

జాగ్వార్ ఎక్స్ఎఫ్ డీజిల్ కారు సున్నా నుంచి కేవలం 7.6 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా 235 kmph స్పీడ్ లిమిట్ తో వస్తుంది. ఇందులోని డాష్‌బోర్డ్‌లో సరికొత్త 11.4-అంగుళాల పివి ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమర్చారు. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గేర్ సెలెక్టర్ డయల్ ను లెదర్ తో కుట్టారు. అది క్రికెట్-బాల్ లాగానే గుండ్రంగా స్మూత్ గా ఉంటుంది. ఈ సరికొత్త ఎడిషన్ లో కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పీఎం 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్, 10-కలర్ యాంబియంట్ లైటింగ్, హీటెడ్, కూల్డ్ ఫ్రంట్ సీట్లు,హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published: