ఉద్యోగులకు సెక్స్ టిప్స్.. అలీబాబా ఛైర్మన్ పదవికి జాక్ మా గుడ్‌బై..

Jack Ma | Alibaba | వర్క్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెబుతూ.. సెక్స్ ప్రాధాన్యం ఎలాంటిదో చెప్పి ప్రపంచానికి కొత్త సూత్రాలు నేర్పిన అలీబాబా సంస్థ చైర్మన్ జాక్ మా(54) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన 55వ పుట్టిన రోజున పదవికి రిటైర్మెంట్ చెప్పేశారు.

news18-telugu
Updated: September 11, 2019, 12:17 PM IST
ఉద్యోగులకు సెక్స్ టిప్స్.. అలీబాబా ఛైర్మన్ పదవికి జాక్ మా గుడ్‌బై..
జాక్ మా
  • Share this:
వర్క్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెబుతూ.. సెక్స్ ప్రాధాన్యం ఎలాంటిదో చెప్పి ప్రపంచానికి కొత్త సూత్రాలు నేర్పిన అలీబాబా సంస్థ చైర్మన్ జాక్ మా(54) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన 55వ పుట్టిన రోజున పదవికి రిటైర్మెంట్ చెప్పేశారు. వారానికి ఆరు రోజులు.. ఆరుసార్లు శృంగారం.. ఎంతసేపు చేశామన్నది ముఖ్యం.. అంటూ సెక్స్ జీవితానికి కొత్త అర్థం చెప్పిన ఈయన.. ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినా అలీబాబా పార్ట్‌నర్‌షిప్ గ్రూపులో సభ్యుడిగా కొనసాగనున్నారు. వాస్తవానికి గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. సంస్థ అవసరాల రీత్యా మరో ఏడాది పాటు ఛైర్మన్ పదవిలో కొనసాగారు. 2013లోనే కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకుని ఎగ్జిక్యూటివ్​ఛైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు గ్రూప్ ప్రస్తుత సీఈవో డానియెల్ ఝాంగ్‌ను జాక్ తన వారసుడిగా ప్రకటించారు.

చైనాలోని ఓ బీద కుటుంబం నుంచి వచ్చిన జాక్ మా పెద్దగా చదువుకోలేదు. కేఎఫ్‌సీ సహా 30 కంపెనీలు ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. చివరికి ఓ కాలేజీలో ఇంగ్లీష్ టీచర్‌గా జీవితం ప్రారంభించారు. 1999లో దానికి స్వస్తి పలికి స్నేహితుల సహాయంతో అలీబాబా.కామ్‌ను ప్రారంభించాడు. ఓ అపార్టుమెంటులో చిన్న ఆఫీస్ పెట్టిన ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అలీబాబాను ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ సంస్థగా మార్చేశారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు