హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR refund: ఆదాయపన్ను చట్టం సెక్షన్ 245 కింద నోటీసు అందిందా? నిపుణుల సూచనలు ఇవే..

ITR refund: ఆదాయపన్ను చట్టం సెక్షన్ 245 కింద నోటీసు అందిందా? నిపుణుల సూచనలు ఇవే..

ITR refund: ఆదాయపన్ను చట్టం సెక్షన్ 245 కింద నోటీసు అందిందా? నిపుణుల సూచనలు ఇవే..

ITR refund: ఆదాయపన్ను చట్టం సెక్షన్ 245 కింద నోటీసు అందిందా? నిపుణుల సూచనలు ఇవే..

ITR refund: ట్యాక్స్ పేయర్ ఆదాయపన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసిన తర్వాత అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన రీ ఫండ్ క్లెయిమ్ చేస్తుంటారు. ఈ క్రమంలో గత సంవత్సరం చెల్లించాల్సిన ట్యాక్స్ డిమాండ్ పెండింగ్‌లో ఉన్నపుడు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 245 కింద ట్యాక్స్ పేయర్‌కు ఇంటిమేషన్ సెండ్ చేస్తారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఐటీఆర్‌(ITR) ఫైల్‌ చేసిన తర్వాత అధికారులు ఏవైనా లోపాలు గుర్తిస్తే నోటీసులు జారీ చేస్తారు. అందుకున్న నోటీసులకు ఎలా స్పందించాలనే దానికిపై అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ నుంచి ఆదాయపన్ను చట్టం సెక్షన్ 245 కింద నోటీసు పంపింతే ఎలా స్పందించాలో తెలుసుకుందాం. అసలు ఆ సెక్షన్ ద్వారా ఆదాయ పన్ను విభాగం ఏ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయో పరిశీలిద్దాం.

* ట్యాక్స్‌ డిమాండ్‌ పెంగింగ్‌లో ఉంటే ఇంటిమేషన్‌

ట్యాక్స్ పేయర్ ఆదాయపన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసిన తర్వాత అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన రీ ఫండ్ క్లెయిమ్ చేస్తుంటారు. ఈ క్రమంలో గత సంవత్సరం చెల్లించాల్సిన ట్యాక్స్ డిమాండ్ పెండింగ్‌లో ఉన్నపుడు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 245 కింద ట్యాక్స్ పేయర్‌కు ఇంటిమేషన్ సెండ్ చేస్తారు.

గత సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సిన డిమాండ్ ట్యాక్స్, అసెస్‌మెంట్ ఇయర్‌కు రావాల్సిన రీఫండ్‌ను సర్దుబాటు చేసేందుకు అసెసింగ్ అధికారి(Assessing Officer AO) ట్యాక్స్ పేయర్‌కు ఈ సెక్షన్ కింద సమాచారం ఇస్తారు. అమౌంట్ సర్దుబాటు చేసే ముందు అసెసింగ్ అధికారి ఈ నోటీసు పంపుతారు.

ట్యాక్స్ పేయర్స్ అసెసింగ్ అధికారి ఇచ్చిన ఇంటిమేషన్‌కు స్పందించాల్సి ఉంటుంది. ఈ అడ్జస్ట్‌మెంట్ ఎందుకు చేయకూడదో అసెసింగ్ అధికారికి గానీ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC) బెంగళూరు వారికి గానీ చెప్పాల్సి ఉంటుంది. తమకు సెక్షన్ 245 కింద సమాచారం వచ్చిందని ట్యాక్స్ పేయర్ వెంటనే రెస్పాన్స్ ఇవ్వాలని ట్యాక్స్ అడ్వకేట్ మనోజ్ యాదవ్ సూచించారు.

ట్యాక్స్ పేయర్స్‌కు ఈ విషయమై రెండు అవకాశాలున్నాయన్నారు. ఔట్ స్టాండింగ్ డిమాండ్ పే చేయడానికి ఒప్పుకోవడం ఒకటి కాగా, డిమాండ్ ట్యాక్స్ ఉందన్న విషయాన్ని పూర్తిగా తిరస్కరించొచ్చని, లేదా పాక్షికంగా తిరస్కరించడం అనేది మరొక అవకాశమని అడ్వకేట్ యాదవ్ వివరించారు.

ఇది కూడా చదవండి : విమాన టికెట్ ధర మీరే లాక్ చేసుకోవచ్చు.. స్పైస్‌ జెట్ స్పెషల్ ఆఫర్.. పూర్తి వివరాలు ఇలా..

* ఆన్‌లైన్‌ పోర్టల్‌లో చెక్‌ చేయాలి

తమకు నోటీసు వచ్చిన వెంటనే తొలుత అసెస్సీలు ఆన్‌లైన్‌లో ట్యాక్స్ పోర్టల్‌లో తమ పేరిట ఔట్ స్టాండింగ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఉందా? లేదా? అనేది పరిశీలించాలి. గత సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ ట్యాక్స్ పెండింగ్‌లో ఉందా అనే విషయం ధ్రువీకరించుకోవాలి. ఎందుకంటే ఒకోసారి ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌లో ఏదైనా తప్పు జరిగినట్లయితే ట్యాక్స్ డిమాండ్ అనేది అలానే కొనసాగే అవకాశముంటుందని ఏకేఎం గ్లోబల్ సంస్థ ట్యాక్స్ మార్కెట్ హెడ్ యీషు సెహగల్ చెప్పారు.

ట్యాక్స్ పేయర్ తనకు వచ్చిన నోటీసుకు నెలలోపు రెస్పాండ్ కావొచ్చని తెలిపారు. ట్యా్క్స్ పేయర్ ఒకవేళ అసెసింగ్ అధికారి ఇచ్చిన నోటీసుకు రెస్పాన్స్ నెల లోపు ఫైల్ చేయనట్లయితే ఔట్ స్టాండింగ్ డిమాండ్‌ను రీఫండ్‌తో సర్దుబాటు చేసే అవకాశం అధికారులకు ఇచ్చినట్లే అవుతుంది. అలా ఆదాయపు పన్ను శాఖ అధికారులు రీఫండ్ అమౌంట్‌ను, పెండింగ్ డిమాండ్ ట్యాక్స్‌తో సర్దుబాటు చేస్తారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Income tax, ITR, ITR Filing, Personal Finance