హోమ్ /వార్తలు /బిజినెస్ /

Financial Deadlines: డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే...

Financial Deadlines: డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Financial Deadlines | ఆర్థిక అంశాలకు సంబంధించి డిసెంబర్‌లో పూర్తి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ (ITR Filing), ఈపీఎఫ్ అకౌంట్‌లో నామినీ పేరు అప్‌డేట్ చేయడం లాంటివి ఉన్నాయి.

డిసెంబర్ ముగియడానికి ఇంకో రెండువారాలు ఉంది. ఈ ఏడాది కూడా ముగుస్తోంది. అయితే ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవన్నీ ఆర్థిక అంశాలకు సంబంధించినవి. పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్ ఐటీ రిటర్స్ ఫైల్ చేయాలి. ఇక పీఎఫ్ అకౌంట్ హోల్డర్లు తమ నామినీ వివరాలు ఈ నెలాఖరులోగా అప్‌డేట్ చేయాలని ఈపీఎఫ్ఓ ఇప్పటికే కోరింది. ఇవేకాదు... మరో రెండు ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. ఈ పనుల్ని వెంటనే పూర్తి చేయకపోతే భారీ నష్టం తప్పదు. మరి ఆ ఫైనాన్షియల్ డెడ్‌లైన్స్ ఏవో తెలుసుకోండి.

1. ITR Filing: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ తప్పించుకోవడం మాత్రమే కాదు ఇతర బెనిఫిట్స్ ఉంటాయని ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గడువు లోగా ఐటీ రిటర్స్ ఫైల్ చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Jio Rs 1 Plan: జియో మరో సంచలనం... ఒక్క రూపాయికే ప్రీపెయిడ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

2. PF Account: పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ నామినీ పేరు యాడ్ చేయాలని ఈపీఎఫ్ఓ చాలాకాలంగా కోరుతోంది. 2021 డిసెంబర్ 31 నాటికి నామినీ వివరాలు యాడ్ చేయాలి. డిసెంబర్ 31 లోగా పీఎఫ్ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో ఈ పని చేయొచ్చు. ఈపీఎఫ్ అకౌంట్‌లో నామినీ పేరు యాడ్ చేయడానికి ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవండి.

ఈపీఎప్ఓ వెబ్‌సైట్ epfindia.gov.in ఓపెన్ చేయాలి.

'Services' సెక్షన్‌లో 'For Employees' సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత 'Member UAN/Online Service (OCS/OTCP)' సెలెక్ట్ చేయాలి.

యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.

'Manage' పేజ్‌లో ఇ-నామినేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

'Add Family Details' క్లిక్ చేసి మీ కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేయాలి.

నామినీకి సంబంధించిన వివరాలన్నీ సబ్మిట్ చేయాలి.

ఒకరి కన్నా ఎక్కువ నామినీ పేర్లు యాడ్ చేయాలంటే 'Add New' పైన క్లిక్ చేయాలి.

సబ్మిట్ చేసిన తర్వాత పీఎఫ్ అకౌంట్‌లో వివరాలు అప్‌డేట్ అవుతాయి.

నామినేషన్ సదుపాయంతో పీఎఫ్, ఈపీఎస్, EDLI బెనిఫిట్స్ నామినీకి లభిస్తాయి.

PAN Card: పాన్ కార్డులో ఈ వివరాలు లేవా? అయితే అది నకిలీ కార్డే

3. Home Loan: బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గించింది. కొత్త లోన్‌తో పాటు హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కస్టమర్లు ఈ ఆఫర్‌ను డిసెంబర్ 31 వరకు పొందొచ్చు. మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే డిసెంబర్ 31 లోగా అప్లై చేసి ప్రయోజనం పొందండి.4. Audit Report: ఎక్కువ ఆదాయం పొందుతున్నవారు ఐటీ రిటర్స్‌తో పాటు ఆడిట్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయాలి. ఈ నెలాఖరులోగా ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయడం తప్పనిసరి. వార్షికాదాయం రూ.10 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న వ్యాపారులు ఆదాయపు పన్ను రిటర్స్‌తో పాటు ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయాలి. రూ.50 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టెక్నీషియన్స్ కూడా ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ.

First published:

Tags: EPFO, ITR, ITR Filing, Personal Finance

ఉత్తమ కథలు