హోమ్ /వార్తలు /బిజినెస్ /

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే ముఖ్యమైన తేదీలు... గుర్తుంచుకోకపోతే చిక్కులే

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే ముఖ్యమైన తేదీలు... గుర్తుంచుకోకపోతే చిక్కులే

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే ముఖ్యమైన తేదీలు... గుర్తుంచుకోకపోతే చిక్కులే
(ప్రతీకాత్మక చిత్రం)

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే ముఖ్యమైన తేదీలు... గుర్తుంచుకోకపోతే చిక్కులే (ప్రతీకాత్మక చిత్రం)

Important Dates | ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక అంశాలకు సంబంధించి పలు ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. ఆ తేదీలు గుర్తుంచుకోకపోతే చిక్కులు తప్పవు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొత్త ఆర్థిక సంవత్సరం (Financial Year) ప్రారంభమైంది. ఏప్రిల్ 1 నుంచే ఆర్థిక అంశాలకు సంబంధించి అనేక మార్పులు ఉంటాయి. కొత్తకొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. అయితే ఆర్థిక అంశాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు (Important Dates) కూడా ఉంటాయి. ఏడాది చివరి వరకూ కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి. ఆ రోజులు గుర్తుంచుకొని పూర్తి చేయాల్సిన పనులు చేయకపోతే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జరిమానాలు కూడా చెల్లించే పరిస్థితి రావొచ్చు. డబ్బు పొదుపు చేయడం దగ్గర్నుంచి పన్ను చెల్లింపుల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమైన తేదీలు ఏవీ? మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటీ? పూర్తి చేయాల్సిన పనులు ఏంటీ? తెలుసుకోండి.

April: ఏప్రిల్ మొదటి వారంలోనే మీరు కొత్త పన్ను విధానంలో కొనసాగుతారా? లేక పాత పన్ను విధానం ఎంచుకుంటారా అని నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా కొనసాగుతుంది. పాత పన్ను విధానంలో కొనసాగాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పన్ను విధానంలో కొనసాగితే ట్యాక్స్ ప్లానింగ్ అవసరం లేదు. కానీ పాత పన్ను విధానం ఎంచుకున్నట్టైతే ఇప్పటినుంచే ట్యాక్స్ ప్లానింగ్ చేయాలి.

Financial Planning: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది... ఈ ఏడాదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

April 1: బంగారు నగలపై ఏప్రిల్ 1 నుంచి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) తప్పనిసరి అయింది. ఇకపై బంగారు నగలపై HUID తప్పనిసరి. HUID 6 డిజిట్స్ గల ఆల్ఫా న్యూమరికల్ కోడ్. ఈ కోడ్ ప్రతీ నగకు భిన్నంగా ఉంటుంది.

April 22: ఏప్రిల్ 22న అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం అమ్మకాలు జోరుగా సాగుతాయి. అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొంటే మంచిదన్న సెంటిమెంట్ ఉండటంతో ఆ రోజున నగలు కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మొత్తం ఒకేసారి కాకుండా దశలవారీగా కొంటే ధర యావరేజ్ అవుతుంది.

May 3: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్స్ అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవడానికి మే 3 చివరి తేదీ. కొద్ది రోజుల క్రితమే ఈ గడువును పొడిగించింది ఈపీఎఫ్ఓ. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఎక్కువ పెన్షన్ పొందాలనుకునేవారు మే 3 లోగా ఆప్షన్ ఇవ్వాలి.

Salary Hike: జీతం పెరుగుతుందని ఎదురుచూస్తున్నారా? ఈసారి నిరాశ తప్పదు

June 15: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సినవారు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మొదటి అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి జూన్ 15 చివరి తేదీ.

July 1: ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయబోతున్నారా? ఒక సంవత్సరంలో రూ.7 లక్షలకు మించితే 20 శాతం ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (TCS) వర్తిస్తుంది. జూలై 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది.

July 31: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. గతంలో ఆదాయపు పన్ను శాఖ ఈ తేదీని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతీసారి చివరి తేదీని పొడిగిస్తుందని అనుకోలేం. కాబట్టి జూలై 31 లోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి.

September 15: ఆదాయపు పన్ను చెల్లించేవారు రెండో అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ.

New Scheme: అన్ని పోస్ట్ ఆఫీసుల్లో మహిళలకు కొత్త స్కీమ్... ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

November 10: అక్షయ తృతీయ తర్వాత బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉండేది ధంతేరాస్ రోజునే. దీపావళికి ముందు వచ్చే ధంతేరాస్ రోజున గోల్డ్ సేల్స్ రికార్డు స్థాయిలో ఉంటాయి. నవంబర్ 10న ధంతేరాస్ ఉంది.

November 30: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందడానికి ఎగ్జిస్టెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి నవంబర్ 30 చివరి తేదీ.

December 15: ఆదాయపు పన్ను చెల్లించేవారు మూడో అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి డిసెంబర్ 15 చివరి తేదీ.

December 31: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్, బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ.

January 31: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్మిట్ చేసిన రివైజ్డ్, బిలేటెడ్ రిటర్న్స్‌ను వెరిఫై చేయడానికి జనవరి 31 చివరి తేదీ.

Savings Scheme: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, ఇతర పథకాల్లో ఉన్నవారికి కొత్త రూల్

February 1: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆదాయపు పన్ను నుంచి కేటాయింపుల వరకు... కేంద్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రకటిస్తుంది.

March 15: ఆదాయపు పన్ను చెల్లించేవారు నాలుగో అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి డిసెంబర్ 15 చివరి తేదీ.

March 31: ఆదాయపు పన్ను ప్రయోజనాలు పొందడానికి మార్చి 31 చివరి తేదీ. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ ప్లానింగ్‌లో ఇంకా ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే మార్చి 31లోగా పూర్తి చేయాలి.

First published:

Tags: Income tax, ITR Filing, Personal Finance, Save Money, TAX SAVING

ఉత్తమ కథలు