ITR Filing: పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు, సంస్థలు ఏటా కచ్చితంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ITR) ఫైల్ చేయాలి. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడమే కాకుండా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చట్టపరమైన చర్యలు, పెనాల్టీలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేవారు ముందుగా సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవాలి. ఈ విషయంలో చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ITR ఫారమ్‌లో ఇన్‌కమ్, డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్, ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లు పేర్కొనాలి.
ప్రతి ITR ఫారమ్‌ను వివిధ రకాల ఆదాయాలు, ఆర్థిక పరిస్థితులను క్యాప్చర్ చేయడానికి అనుగుణంగా డిజైన్ చేశారు. సరైన ఫారమ్‌ను ఉపయోగిస్తే ఆదాయం, డిడక్షన్స్, ట్యాక్స్ లయబిలిటీస్‌ను సక్రమంగా రిపోర్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి క్లియర్ ట్యాక్స్ వ్యవస్థాపకుడు, CEO అర్చిత్ గుప్తా చేసిన సూచనలు తెలుసుకుందాం.
* ఐటీఆర్ 1
ITR 1ను సహజ్ ఫారమ్ అని కూడా అంటారు. దీన్ని జీతం, ఇతర సోర్స్‌లు(డివిడెండ్‌లు, బ్యాంక్ వడ్డీ మొదలైనవి), వన్ హౌస్ ప్రాపర్టీ, ఏడాదికి రూ.5,000 లోపు వ్యవసాయ ఆదాయం పొందుతున్న భారతదేశంలోని ఆర్డినరీ ట్యాక్స్ రెసిడెంట్స్ ఫైల్ చేస్తారు. పన్ను విధించదగిన ఆదాయం రూ.50 లక్షలు దాటితే, వీరు ITR 1ని ఫైల్ చేయలేరు. ప్రవాస భారతీయులు (NRIలు) కూడా ITR-1ని ఫైల్ చేయడానికి అర్హులు కారు.
* ఐటీఆర్ 2
జీతం, ఇతర ఇన్‌కమ్ సోర్స్‌లు, మల్టిపుల్ హౌస్ ప్రాపర్టీస్ ఆదాయం పొందే వాళ్లు ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి. దీనిని ట్యాక్స్ రెసిడెంట్స్(ఆర్డినరీ, నాన్-ఆర్డినరీ), NRIలు ఇద్దరూ ఉపయోగించవచ్చు. పన్ను విధించదగిన ఆదాయం రూ.50 లక్షలు దాటితే, ITR 1 ఫైల్ చేయడానికి అవసరమైన షరతులు సరిపోతున్నా సరే, ITR 2ని తప్పనిసరిగా ఫైల్ చేయాలి.
ఇదే విధంగా అన్ లిస్టెడ్ షేర్లను కలిగి ఉన్న వ్యక్తులు లేదా కంపెనీ డైరెక్టర్‌లుగా పనిచేస్తున్న వ్యక్తులు ITR 1కి బదులు ITR 2ని ఫైల్ చేయాలి. ఒక వ్యక్తి ఏదైనా విదేశీ ఆస్తులను కలిగి ఉంటే కూడా ITR 2 వినియోగించాలి.
* ఐటీఆర్ 3
ITR 3 ఫారమ్ బిజినెస్ ఇన్‌కమ్, సంస్థల నుంచి రెమ్యునరేషన్, ఇతర సోర్స్‌ల నుంచి పొందే రకాల ఆదాయాలను కవర్ చేస్తుంది. ఇది ITR 2 కంటే మరింత సమగ్రమైనది. వ్యక్తులు అకౌంట్ బుక్స్ మేనేజ్ చేయడం, లేదా 44AD/44ADA/44AE సెక్షన్‌ల కింద ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఎంచుకున్న సందర్భాలను కూడా మెయింటెన్ చేస్తుంది.
Simple One e-scooter: సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ ప్రయాణం..మార్కెట్లోకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
* ఐటీఆర్ 4
ITR 4ను సుగమ్ ఫారమ్ అని అంటారు. జీతం, ఇతర సోర్స్‌లు (డివిడెండ్‌లు, బ్యాంక్ వడ్డీ మొదలైనవి), హౌస్ ప్రాపర్టీ, సంవత్సరానికి రూ. 5,000 మించకుండా ఉన్న వ్యవసాయ ఆదాయం ఉన్న భారతదేశంలోని ఆర్డినరీ ట్యాక్స్ రెసిడెంట్స్ ఫైల్ చేస్తారు. వారు తప్పనిసరిగా ప్రిజమ్టివ్ ట్యాక్సేషన్ కింద బిజినెస్ ఇన్‌కమ్ రిపోర్ట్ చేయాలి. పన్ను విధించదగిన ఆదాయం రూ.50 లక్షలు దాటితే, ITR 4 ఫైల్ చేయకూడదు. ITR 3ని సెలక్ట్ చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్ సజెషన్స్
ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ITR ఫైల్ చేస్తున్నప్పుడు, సరైన ఫారమ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నివేదించే ఆదాయ రకాల ఆధారంగా సిస్టమ్ ఆటోమేటిక్‌గా తగిన ఫారమ్‌ను నిర్ణయిస్తుంది. ఆదాయ పన్ను శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2023-24) ITR 1, 4లను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసే అవకాశం కల్పించింది. ఆడిట్ అవసరం లేని వారికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి జూలై 31 గడువు. ఈలోగా పన్ను పరిధిలోకి వచ్చేవారు రిటర్న్స్ ఫైల్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, ITR Filing, Tax paying