Home /News /business /

ITR FILING MISSED DECEMBER 31 DEADLINE HERES WHAT YOU CAN DO MK

ITR Filing: ఐటీఆర్ ఇంకా ఫైల్ చేయలేదా...డిసెంబర్ 31 తో ముగిసిన గడువు...అయిన చాన్స్ ఉంది..ఏం చేయాలంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పుడు కూడా మీరు ఇప్పటికీ మీ ITR ఫైల్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఏదైనా ఆర్థిక సంవత్సరానికి గడువు ముగిసిన తర్వాత కూడా రిటర్న్‌లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. దీని కోసం మీరు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

    ఆదాయపు పన్ను రిటర్న్, ITR  దాఖలు చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2021తో  ముగిసింది. 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మీరు ఐటీఆర్‌ను ఫైల్ చేయకుంటే, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు ఇప్పటికీ మీ ITR ఫైల్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఏదైనా ఆర్థిక సంవత్సరానికి గడువు ముగిసిన తర్వాత కూడా రిటర్న్‌లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. దీని కోసం మీరు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పోస్ట్ డేటెడ్ ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 మార్చి 2022 అని గుర్తుంచుకోండి.

    5 వేల వరకు జరిమానా చెల్లించాలి..

    ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయంలోగా ఏ సంవత్సరానికైనా రిటర్న్‌లను దాఖలు చేయనందుకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లేట్ పెనాల్టీ రూ. 5,000 వరకు ఉంటుంది. నియమం ప్రకారం, రూ. 5,000 జరిమానాతో ఆలస్యమైన ITRని మార్చి 31, 2022 వరకు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షలు ఉంటే. పన్ను చెల్లింపుదారు రూ. 1,000 జరిమానా చెల్లించాలి. అయితే, ఆదాయ మినహాయింపు పరిమితి రూ. 2.50 లక్షలు పరిధిలోకి వచ్చే వారికి ఆలస్య రుసుము ఉండదు.

    రిటర్న్ ఫైల్ చేయడంలో పొరపాటు చేస్తే?

    ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన వారు, రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే, రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రివైజ్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ కూడా 31 మార్చి 2022.

    ఇదిలా ఉంటే  డిసెంబర్ 31 గడువు వరకు కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సుమారు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఐటి శాఖ తెలిపింది. ఇందులో చివరి తేదీ లేదా డిసెంబర్ 31న 46.11 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. అంతకుముందు కరోనా రెండవ వేవ్ కారణంగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీని 30 సెప్టెంబర్ 2021 వరకు పొడిగించారు. తర్వాత, ఐటీ పోర్టల్‌లో సాంకేతిక లోపాల ఫిర్యాదుల కారణంగా 31 డిసెంబర్ 2021 వరకు పొడిగించారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: ITR Filing

    తదుపరి వార్తలు