Home /News /business /

ITR FILING KEY THINGS TO KNOW ABOUT REVISED UPDATED AND BELATED RETURNS UMG GH

ITR filing: టాక్స్ పేయర్స్‌కి అలర్ట్.. ఈ మూడు రిటర్న్‌ల గురించి విన్నారా.. తప్పకుండా తెలుసుకోండి..!

టాక్స్ పేయర్స్‌కి అలర్ట్.. ఈ మూడు రిటర్న్‌ల గురించి విన్నారా..

టాక్స్ పేయర్స్‌కి అలర్ట్.. ఈ మూడు రిటర్న్‌ల గురించి విన్నారా..

గత నెల 31వ తేదీతో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు (Income Tax Returns) ఫైల్ చేసే గడువు ముగిసింది. అయినా కూడా ఇప్పటికీ పన్ను చెల్లింపుదారులు రివైజ్డ్‌ (Revised), అప్‌డేటెడ్ (Updated), బిలేటెడ్ రిటర్న్‌ల (Belated Returns)ను ఫైల్ చేయవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
గత నెల 31వ తేదీతో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు (Income Tax Returns) ఫైల్ చేసే గడువు ముగిసింది. అయినా కూడా ఇప్పటికీ పన్ను చెల్లింపుదారులు రివైజ్డ్‌ (Revised), అప్‌డేటెడ్ (Updated), బిలేటెడ్ రిటర్న్‌ల (Belated Returns)ను ఫైల్ చేయవచ్చు. అయితే పన్ను చెల్లింపుదారులకు ఈ రివైజ్డ్‌, అప్‌డేటెడ్, బిలేటెడ్ రిటర్న్‌లు అంటే ఏంటో కచ్చితంగా తెలియక గందరగోళంగా ఫీలవుతుంటారు. మరి ఈ విభిన్న రకాల రిటర్న్‌ల మధ్య తేడా ఏంటి? వీటి గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒరిజినల్ రిటర్న్స్ అంటే ఏంటి?

గడువులోపు ఐటీఆర్‌ని ఫైల్ చేసేదాన్నే ఒరిజినల్ రిటర్న్స్ అని అంటారు. సాధారణంగా, ప్రభుత్వం ఈ గడువు తేదీని పొడిగిస్తే తప్ప పన్ను చెల్లింపుదారులు ఏ ఏడాది అయినా సరే జులై 31లోగా ఐటీఆర్‌ను ఫైల్ చేయడం తప్పనిసరి. ఎలాంటి పెనాల్టీ చెల్లించకుండా ఒరిజినల్ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.

ఇదీ చదవండి: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!


రివైజ్డ్‌ రిటర్న్స్ అంటే ఏంటి?

ఒక్కోసారి ఐటీ రిటర్న్‌ను ఫైల్ చేసిన తర్వాత కొంత సమాచారాన్ని అందించడం మర్చిపోయామని లేదా ఒక సమాచారం గురించి పూర్తిగా వివరించలేదని గుర్తుకొస్తుంది. అలాంటప్పుడు పన్ను చెల్లింపుదారులు మళ్లీ ఆ సమాచారాన్ని జత చేస్తూ రివైజ్డ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. రివైజ్డ్‌ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువు తేదీ అనేది సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసేలోపు ఉంటుంది. దీని కోసం ఎలాంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా/ మోసం చేసేందుకు సమాచారం అందించలేదని తేలితే.. రిటర్న్ రివిజన్‌ తిరస్కరణకు గురవుతుంది. అలానే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.

అప్‌డేటెడ్ రిటర్న్‌లు అంటే ఏంటి?

ఐటీ చట్టంలోని సెక్షన్ 139(8A) ప్రకారం, అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఫైల్ చేసే ఆప్షన్ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటుంది. ఫైనాన్స్ యాక్ట్, 2022 అనేది పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ సమయం ఇచ్చేందుకు అప్‌డేటెడ్ రిటర్న్స్‌ ఆప్షన్‌ను పరిచయం చేసింది. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 24 నెలలలోపు అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే ఈ రిటర్న్స్‌ ఫైల్ చేసేటప్పుడు కొన్ని షరతులకు లోబడి ఉండాల్సి ఉంటుంది. బిలేటెడ్ రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత కూడా అప్‌డేటెడ్ రిటర్న్‌లు ఫైల్ చేయవచ్చు. అప్‌డేటెడ్ రిటర్న్‌లు ఫైల్ చేసే పన్ను చెల్లింపుదారులు పెనాల్టీ లేదా రుసుము చెల్లించనక్కర్లేదు. అయితే, వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 140B ప్రకారం అడిషనల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.



బిలేటెడ్ రిటర్న్‌లు అంటే ఏంటి?

గడువు తేదీలోగా ఐటీఆర్‌లను ఫైల్ చేయలేకపోయిన పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ బిలేటెడ్ రిటర్న్‌లు ఫైల్ చేయవచ్చు. కాకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. బిలేటెడ్ రిటర్న్‌ను దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F ప్రకారం రూ.5,000 రుసుము చెల్లించాలి. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే.. ఆలస్య రుసుముగా రూ. 1,000 చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ చెల్లించాల్సిన పన్ను ఉంటే... గడువు తేదీ ముగిసిన తర్వాత నుంచి ITR ఫైల్ చేసే వరకు ఆ పన్నుపై నెలకు 1 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది.
Published by:Mahesh
First published:

Tags: Income tax, IT Returns, ITR, ITR Filing

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు