హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Filing: ITR-U అంటే ఏంటి, దీన్ని ఎవరు ఫైల్‌ చేయాలి..? దీంతో ప్రయోజనాలు ఏంటో తెలుసా.. కచ్చితంగా తెలుసుకోండి..!

ITR Filing: ITR-U అంటే ఏంటి, దీన్ని ఎవరు ఫైల్‌ చేయాలి..? దీంతో ప్రయోజనాలు ఏంటో తెలుసా.. కచ్చితంగా తెలుసుకోండి..!

ITR-U అంటే ఏంటి, దీన్ని ఎవరు ఫైల్‌ చేయాలి..?

ITR-U అంటే ఏంటి, దీన్ని ఎవరు ఫైల్‌ చేయాలి..?

ఫారమ్ ITR-U ఫైల్ చేయడానికి టైమ్‌లైన్‌ అసెస్‌మెంట్ ఇయర్‌(AY) ముగిసిన 24 నెలలలోపు ఉంటుంది. ఉదాహరణకు ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2019-20కి సంబంధించిన అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2021 మార్చి 31న ముగుస్తుంది. కాబట్టి 2023 మార్చి 31 వరకు ఫారమ్ ITR-Uని ఫైల్ చేయవచ్చు.

ఇంకా చదవండి ...

వీసా ప్రాసెసింగ్, లోన్, క్రెడిట్ కార్డ్, ఇన్సూరెన్స్‌ కోసం దరఖాస్తు చేస్తుంటే.. మూడు సంవత్సరాల పన్ను రిటర్న్ కాపీని సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. మునుపటి సంవత్సరాల్లో ఏదైనా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్(ITR) దాఖలు చేయకుండా ఉంటే సమస్య తలెత్తుతుంది. అందుకే ప్రస్తుత సంవత్సరం ఐటీఆర్‌ కాపీని సిద్ధం చేసుకోవడం ఎప్పుడూ మంచిది. ఫైనాన్స్‌ బిల్‌, 2022లో, ఆదాయ పన్ను చట్టం, 1961(ITA)లో కొత్త సెక్షన్ 139(8A)ను చేర్చారు. ఈ నిబంధన ప్రకారం ఏ వ్యక్తి అయినా గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అప్‌డేట్ ట్యాక్స్‌ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది వర్తిస్తుంది. ట్యాక్స్‌ రిటర్న్ దాఖలు చేశారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఫారమ్ ITR-Uని సమర్పించవచ్చు.

ఫారమ్ ITR-U ఫైల్ చేయడానికి టైమ్‌లైన్‌ అసెస్‌మెంట్ ఇయర్‌(AY) ముగిసిన 24 నెలలలోపు ఉంటుంది. ఉదాహరణకు ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2019-20కి సంబంధించిన అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2021 మార్చి 31న ముగుస్తుంది. కాబట్టి 2023 మార్చి 31 వరకు ఫారమ్ ITR-Uని ఫైల్ చేయవచ్చు.

* ఫారమ్ ITR-U ఫైల్ చేయడానికి అర్హత

ఫారమ్ ITR-Uని ఫైల్ చేయడానికి కారణాలను తెలియజేయాలి. ఈ కారణాలు గతంలో పన్ను చెల్లించాల్సిన వాటికి రిటర్న్‌ ఫైల్‌ చేయకపోవడం, నిర్దిష్ట ఆదాయాలను పేర్కొనడం మిస్‌ అవడం, ఎంపిక చేసుకున్న రాంగ్‌ హెడ్స్‌ ఆఫ్‌ ఇన్‌కం, క్యారీ ఫార్వర్డ్ లాసెస్‌, రిడక్షన్‌ ఆఫ్‌ అన్‌అబ్‌జార్బ్‌డ్‌ డెప్రిసియేషన్‌, సెక్షన్ 115JB/115JC కింద పన్ను క్రెడిట్ తగ్గింపు, తప్పుడు పన్ను రేటు వంటివి ఉంటాయి.

ఇదీ చదవండి: హర్ ఘర్ తిరంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఇదే నినాదం..!


నిల్ రిటర్న్, లాస్ రిటర్న్, రీఫండ్‌లో పెరుగుదల లేదా రీఫండ్ క్లెయిమ్ చేసిన సందర్భంలో ఫారమ్ ITR-U ఫైల్ చేయలేరు. అదే విధంగా.. పేర్కొన్న అసెస్‌మెంట్‌ ఇయర్‌ కోసం సెర్చ్‌, సర్వే లేదా ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తే కూడా ITR-U ఫైల్ చేయలేరు. పేర్కొన్న అసెస్‌మెంట్‌ ఇయర్‌ కోసం అసెస్‌మెంట్, రీఅసెస్‌మెంట్, రివిజన్ లేదా రీకంప్యూటేషన్ పెండింగ్‌లో ఉంటే లేదా పూర్తి అయితే ఫైల్‌ చేసే అవకాశం ఉండదు.

సూచించిన ఇన్‌కమ్‌ హెడ్‌ల కింద పన్ను చెల్లించే ఆదాయ మొత్తాన్ని మాత్రమే అందించాలి. సాధారణ ITR ఫారమ్‌ల మాదిరిగా ఇన్‌కం బ్రేకప్‌, సమర్పించాల్సిన ఇతర వివరాలు లేవు. అయితే, అసెస్‌మెంట్ ఇయర్‌కి అప్‌డేట్ చేసిన ట్యాక్స్‌ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఒక అవకాశం మాత్రమే లభిస్తుంది. ITR-1 నుంచి ITR-7 ఫారమ్‌లతో అవసరమైన దానితోపాటు ఫారమ్ ITR-U ఫైల్ చేయాలి.

* ఫారమ్ ITR-U ఫైల్ చేయడంపై ట్యాక్స్‌ లయబిలిటీ

ఫారమ్ ITR-Uని ఫైల్ చేయాలనుకుంటే, సాధారణ పన్ను కాకుండా, వడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్‌మెంట్‌ ఇయర్‌ ముగిసిన 12 నెలలలోపు రిటర్న్ ఫైల్ చేస్తే.. 25 శాతం అదనపు పన్ను చెల్లించాలి. రిటర్న్‌ను 12 నెలల తర్వాత ఫైల్ చేస్తే సంబంధిత అసెస్‌మెంట్‌ ఇయర్‌ ముగింపు నుంచి 24 నెలల ముందు, అదనపు ట్యాక్స్‌ లయబిలిటీ 50 శాతానికి పెరుగుతుంది. అదనపు పన్ను చెల్లించకుండా ఐటీఆర్ ఫైల్ చేస్తుంటే, రిటర్న్ చెల్లనిదిగా పరిగణిస్తారు. లిమిటెడ్‌ ట్యాక్స్‌ లయబిలిటీ ఉంటే ఫారమ్ ITR-Uని ఫైల్ చేయవచ్చు.

* ఫారమ్ ITR-U ఫైల్ చేయడం వల్ల ప్రయోజనాలు

సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ అసెస్‌మెంట్, సెక్షన్ 144 కింద బబెస్ట్‌ జడ్జిమెంట్‌ అసెస్‌మెంట్‌, సెక్షన్ 147 కింద ఇన్‌కమ్‌ ఎస్కేపింగ్‌ అసెస్‌మెంట్ నుంచి రక్షించుకోవడం మొదటి ప్రయోజనంగా చెప్పవచ్చు. అలాగే సర్వే, జప్తు ప్రక్రియలు, వ్యాజ్యాలు వంటి ఇబ్బందులు, జరిమానాలు, ప్రాసిక్యూషన్ వంటి వాటిని నివారించవచ్చు.

First published:

Tags: Income tax, IT Returns, ITR, ITR Filing

ఉత్తమ కథలు