ఆదాయపు పన్ను రిటర్న్స్ (IT Returns) ఫైల్ చేసే గడువు ముగిసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) సమాచారం ప్రకారం జూలై 31 రాత్రి 11 గంటల వరకు 5.78 కోట్ల రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. చివరి రోజే 67 లక్షలకు పైగా రిటర్న్స్ ఫైల్ కావడం విశేషం. గతేడాది ఐటీ రిటర్న్స్ లెక్క చూస్తే డిసెంబర్ 31 నాటికి 5.9 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు. 2022 మార్చి 15 నాటికి 6.63 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు. అంటే గడువు ముగిసిన తర్వాత కూడా ఫైన్ చెల్లించి ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) చేసినవాళ్లు ఉన్నారు. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసేవారు ఛార్జీలు చెల్లించడంతో పాటు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది.
పెనాల్టీ ఛార్జీల వివరాలు చూస్తే గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారి వార్షికాదాయం రూ.5,00,000 లోపు ఉంటే రూ.1,000 జరిమానా చెల్లించాలి. వార్షికాదాయం రూ.5,00,000 కన్నా ఎక్కువగా ఉంటే రూ.5,000 జరిమానా చెల్లించాలి. అంటే ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసేవారు వారి వార్షికాదాయాన్ని బట్టి రూ.1,000 లేదా రూ.5,000 జరిమానా చెల్లించడం తప్పనిసరి. కనీస మినహాయింపు లిమిట్ రూ.2,50,000 ఉన్నవారు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లిమిట్ వృద్ధులకు రూ.3,00,000 నుంచి రూ.5,00,000 మధ్య ఉంది. ఇక రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఏవైనా పన్నులు చెల్లించాల్సి ఉంటే నెలకు 1 శాతం చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి పన్నులు రూ.10,000 లోపు ఉన్నవారికే ఇది వర్తిస్తుంది.
New Rules in August: నేటి నుంచి ఈ కొత్త రూల్స్... అన్నీ మీ డబ్బుకు సంబంధించినవే
ఒకవేళ పన్నులు రూ.10,000 దాటి, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించనట్టైతే పెనాల్టీ నెలకు 1 శాతం చొప్పున వర్తిస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ విషయానికి వస్తే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో జూలై 15 లోపు 30 శాతం, డిసెంబర్ 15 లోపు 60 శాతం, మార్చి 31 లోపు 100 శాతం ట్యాక్స్ చెల్లించాలి. కొందరు కొంత సమాచారంతో లేదా రిటర్న్స్ చూపించకుండా జూలై 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారని, రూ.5,000 ఫైన్ తప్పించుకోవడానికి ఇలా చేస్తుంటారని, వారంతా ఆగస్టులోగా రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుందని CharteredClub.com ఫౌండర్ కరన్ బాత్రా మనీకంట్రోల్‌తో చెప్పారు.
గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా కొన్ని బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ లాసెస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకునేవారికి డ్యూ డేట్ తర్వాత అవకాశం ఉండదు. ఒకవేళ డెడ్‌లైన్ లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే అసెస్‌మెంట్ ఇయర్ 2030-31 వరకు లేదా ఎనిమిదేళ్లు లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ అమ్మకాలపై వచ్చే నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయని వారు, నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్‌కు క్షమాపణ విజ్ఞప్తి లేఖ రాయొచ్చని TaxSpanner.com కో-ఫౌండర్ సుధీర్ కౌషిక్ తెలిపారు.
Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి
ఇక రిటర్న్స్ ఆలస్యంగా ఫైల్ చేస్తే ట్యాక్స్ రీఫండ్‌పై వడ్డీ కూడా రాదు. మీరు ఏదైనా డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలనుకున్నా, ఇతర ఆదాయాలు ఏవైనా చూపాలనుకున్నా బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసినవారికి 2022 డిసెంబర్ 31 వరకు రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, ITR, Itr deadline, ITR Filing, Personal Finance