Home /News /business /

ITR FILING 2022 KNOW WHICH ARE IMPORTANT DOCUMENTS FOR FILING INCOME TAX RETURNS SS

ITR Filing: ఈ 10 డాక్యుమెంట్స్ ఉంటే ఐటీ రిటర్న్స్ ఈజీగా ఫైల్ చేయొచ్చు

ITR Filing: ఈ 10 డాక్యుమెంట్స్ ఉంటే ఐటీ రిటర్న్స్ ఈజీగా ఫైల్ చేయొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

ITR Filing: ఈ 10 డాక్యుమెంట్స్ ఉంటే ఐటీ రిటర్న్స్ ఈజీగా ఫైల్ చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

ITR Filing 2022 | ఐటీ రిటర్న్స్ (IT Returns) ఫైల్ చేయడం పెద్ద సవాల్ అనుకుంటారు ట్యాక్స్ పేయర్స్. కానీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంటే గంటలో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (IT Returns) ఫైల్ చేయడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈసారి గడువు పొడిగించే ఆలోచనలో లేనట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి చివరి తేదీలోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. గడువు దాటిపోతే ఫైల్ చెల్లించాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైల్ (ITR Filing) చేయడానికి కొన్ని ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయడం సులువు. ఫైల్ చేస్తున్న సమయంలో డాక్యుమెంట్స్ వెతుక్కోవడమంటే పెద్ద తలనొప్పి. అందుకే రిటర్న్స్ ఫైల్ చేయడానికి లాగిన్ కావడానికన్నా ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి. మరి ఏఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకోండి.

PAN Card: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి. మీ ఆర్థిక లావాదేవీలన్నీ పాన్ నెంబర్‌తోనే ట్రాక్ అవుతుంటాయి. మొదటిసారి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు మీ పాన్ కార్డ్ సిద్ధంగా పెట్టుకోవాలి.

Aadhaar: ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం ఆధార్ కార్డును ఉపయోగిస్తుంది. ఐటీఆర్ ఫామ్ ఇ-వెరిఫై చేయాలంటే ఆధార్ తప్పనిసరి. మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింకై ఉండాలి.

Railway Tickets: సీనియర్ సిటిజన్లకు మళ్లీ రైలు టికెట్లపై కన్సెషన్... కానీ ఓ కండీషన్

Form 16: ఉద్యోగులకు కంపెనీ ఫామ్ 16 సర్టిఫికెట్ ఇస్తుంది. ఇందులో సాలరీ డీటెయిల్స్‌తో పాటు టీడీఎస్ వివరాలు ఉంటాయి. పార్డ్ ఏలో పేరు, ఉద్యోగి పాన్ నెంబర్, యజమాని ట్యాన్, పాన్ వివరాలు, టీడీఎస్ వివరాలు ఉంటాయి. పార్ట్ బీలో పన్ను మినహాయింపులు ఉంటాయి.

Form 26AS: ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే యాన్యువల్ ట్యాక్స్ స్టేట్‌మెంట్‌ను ఫామ్ 26ఏఎస్ అంటారు. ఇందులో మీ దగ్గర్నుంచి డిడక్ట్ చేసిన ట్యాక్స్, అడ్వాన్స్‌డ్ ట్యాక్స్, రీఫండ్స్ వివరాలు ఉంటాయి.

Annual Information Statement: ఫామ్ 26ఏఎస్‌తో పోలిస్తే మరిన్ని వివరాలతో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ ఉంటుంది. ఇందులో ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ వివరాలు ఉంటాయి. ఇందులోనే సాలరీ, డివిడెండ్స్, సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీ, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు... ఇలా అన్ని వివరాలు ఉంటాయి.

Bank Holidays: ఆగస్టులో 10 సెలవులు... ఒక లాంగ్ వీకెండ్... హాలిడేస్ లిస్ట్ ఇదే

Bank Statements: మీ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కూడా డౌన్‌లోడ్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. వేర్వేరు మార్గాల్లో మీ సేవింగ్స్ అకౌంట్‌లో జమ అయిన వడ్డీ వివరాలు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉంటాయి.

Bank Interest Certificates: బ్యాంక్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్స్ ఉంటే ఇంకా మంచిది. మీ అకౌంట్‌లోకి జమ అయిన వడ్డీ వివరాలు ఇందులో ఉంటాయి. గరిష్టంగా రూ.10,000 వరకు వడ్డీకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద మినహాయింపులు పొందొచ్చు.

Home loan Interest Certificate: మీరు హోమ్ లోన్ తీసుకొని వడ్డీ చెల్లిస్తున్నారా? హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 24బీ కింద హోమ్ లోన్‌కు చెల్లించిన ప్రిన్సిపల్, వడ్డీకి మినహాయింపు పొందొచ్చు.

Capital Gain/Loss Statement: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నవారు వాటిని అమ్మితే వచ్చిన లాభంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ నష్టపోయినట్టైతే ఆ నష్టాన్ని కూడా చూపించాలి.



Foreign Income: విదేశాల నుంచి ఏదైనా ఆదాయం వచ్చినట్టైతే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ భద్రపర్చుకోవాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో వీటిని సబ్మిట్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, ITR, Itr deadline, ITR Filing, PAN card, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు