ITR Filing: చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లను(ITR) స్వయంగా ఫైల్ చేయడానికి ఇష్టపడతారు. అందరికీ ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్‌లు, నియమాలు, ప్రాసెస్‌పై పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. దీంతో ITR ఆన్‌లైన్‌లో ఫైల్ చేసేటప్పుడు పొరపాట్లు చోటు చేసుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో జరిమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. చివరి నిమిషంలో గడువు సమీపిస్తోందనే తొందరలో కొందరు మిస్టేక్స్ చేస్తుంటారు. చిన్న చిన్న తప్పులే, కొన్ని సందర్భాల్లో లీగల్ ప్రాబ్లమ్స్‌కు దారి తీస్తాయి. ఐటీ అధికారుల నోటీసుల వరకు వెళ్తాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు, తరచూ జరిగే మిస్టేక్‌లు ఏంటో తెలుసుకుందాం. ముందుగానే తెలుసుకోవడం ద్వారా అలాంటివి రిపీట్ చేసే అవకాశాలు తగ్గుతాయి.
* ఐటీఆర్ ఫారం
తప్పు ఐటీఆర్ ఫారం ఫైల్ చేయడం వల్ల ట్యాక్స్ ఫైలింగ్‌ను తిరస్కరించవచ్చు. సోర్స్ ఆఫ్ ఇన్‌కంపైన దాఖలు చేయాల్సిన ఐటీఆర్ ఫారం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు ఐటీఆర్ ఫారం 1ని ఉపయోగించవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌ల ద్వారా క్యాపిటల్ గెయిన్స్ పొందుతున్న వారు తప్పనిసరిగా ఐటీఆర్ ఫారం 2ని ఫైల్ చేయాలి. ఇలా అందుబాటులో ఉన్న ఏడు ఐటీఆర్ ఫారంలలో తమకు ఏది సరిపోతుందో సెలక్ట్ చేసుకోవాలి.
* అసెస్‌మెంట్ ఇయర్
పన్ను చెల్లింపుదారులు తరచుగా ‘అసెస్‌మెంట్ ఇయర్’, ఫైనాన్షియల్ ఇయర్ అనే పదాల మధ్య కన్ఫూజ్ అవుతుంటారు. 2023 జులై 31లోపు ITRను ఫైల్ చేస్తుంటే, 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య ఆర్జించిన ఆదాయాన్ని రిపోర్ట్ చేస్తున్నట్లు గుర్తించాలి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 అవుతుంది. అసెస్‌మెంట్ ఇయర్ ఎల్లప్పుడూ ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఒక సంవత్సరం ముందు ఉంటుంది. అంటే 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ అవుతుంది.
* ఇన్‌కం సోర్సెస్
శాలరీ, రెంటల్ ఇన్‌కం, ఇంట్రెస్ట్ ఇన్‌కం, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఇన్‌కం సహా ITR ఫైల్ చేసేటప్పుడు ఇన్‌కం లభిస్తున్న అన్ని సోర్సెస్‌ను పేర్కొనాలి. ఏదైనా ఇన్‌కం సోర్స్‌ని రిపోర్ట్ చేయడంలో మిస్టేక్ జరిగితే జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
* వ్యక్తిగత సమాచారం
చాలా మంది పేరు, PAN, ఇమెయిల్ ID, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయడంలో తప్పులు చేస్తుంటారు. ఫైల్ చేసే ముందు ఈ వివరాలను మరోసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇలాంటి లోపాలు ITRని ప్రాసెస్‌లో ఆలస్యానికి, సమస్యలకు కారణం కావచ్చు.
* వెరిఫైయింగ్ ఐటీఆర్
ఐటీఆర్‌ను ఫైల్ చేసినట్లు నిర్ధారించుకోవడానికి వెరిఫై చేయడం కీలకం. ఎలక్ట్రానిక్‌గా లేదా ITR ఫైల్ చేసిన 120 రోజులలోపు ITR-V ఫారం ఘసైన్డ్ కాపీని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపడం ద్వారా వెరిఫై చేసుకోవచ్చు.
* బ్యాంక్ అకౌంట్ వివరాలు
ఏదైనా పన్ను రీఫండ్‌లను పొందడానికి సరైన బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించాలి. వివరాలను ఎంటర్ చేయడంలో ఏవైనా పొరపాట్లు జరిగితే.. రీఫండ్ కోల్పోతారు.
* డిడక్షన్స్ క్లెయిమ్
మెడికల్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్, ఛారిటబుల్ డొనేషన్స్ వంటి డిడక్షన్‌లు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ట్యాక్స్ లయబిలిటీని తగ్గించడానికి అర్హత ఉన్న అన్ని డిడక్షన్‌లను క్లెయిమ్ చేసినట్లు నిర్ధారించుకోవాలి. ఏవైనా మర్చిపోతే అనవసరంగా నష్టపోతారు. పాత పన్ను విధానంలో ట్యాక్స్ ఫైల్ చేస్తున్న వారికే ఇది వర్తిస్తుంది.
New Rules: రేపటి నుంచి ఈ కొత్త రూల్స్ గుర్తుంచుకోండి... చిక్కులు తప్పవు మరి
* అవసరమైన డాక్యుమెంట్‌లు
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు క్లెయిమ్‌లను ధృవీకరించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, రసీదులు, ఇన్‌వాయిస్‌లు ఉంచుకోవాలి. సరైన రికార్డులను నిర్వహించడం చాలా కీలకం. పన్ను అధికారుల ఏవైనా వివరాలు కోరితే ఈ డాక్యుమెంట్‌లు ఉపయోగపడతాయి.
* ఫారిన్ అసెట్స్
బ్యాంక్ అకౌంట్‌లు, అసెట్స్ సహా ఏవైనా ఫారిన్ అసెట్స్ ఉంటే కచ్చితంగా ఐటీఆర్‌లో స్పష్టం చేయాలి. అలా చేయకపోతే జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
* ఐటీఆర్ గడువు
జరిమానాలు, వడ్డీలను నివారించడానికి సమయానికి ITR ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ITR ఫైల్ చేయడానికి గడువు తేదీ జులై 31. కొన్ని సందర్భాల్లో దీనిని సెప్టెంబర్ 30 వరకు పొడిగించవచ్చు.
* ఫారం 16, ఫారం 26AS మిస్‌మ్యాచ్
ట్యాక్స్ క్రెడిట్‌లు ఉండే స్టేట్‌మెంట్ ఫారం 26AS, యజమాని అందించే ఫారం 16లోని వివరాలు సరిపోవాలి. రెండింటిలో వివరాలు ఒకేలా ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే ITR ఫైల్ చేసే ముందు సరిదిద్దుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, ITR, ITR Filing