ITR Alert: మీ ఐటీఆర్‌లో హెచ్ఆర్ఏ ఎలా ప్లాన్ చేశారు?

మీ అద్దె ఖర్చుల కోసం మీ యజమాని నుంచి అలెవన్స్ తీసుకుంటున్టయితే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(13 ఏ) కింద హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ) క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి సమయంలో మీరు అద్దె రసీదులు, వార్షిక అద్దె రూ.లక్ష దాటితో ఇంటి యజమాని పాన్ నెంబర్ మీ సంస్థ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: January 7, 2019, 12:30 PM IST
ITR Alert: మీ ఐటీఆర్‌లో హెచ్ఆర్ఏ ఎలా ప్లాన్ చేశారు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇది పన్నుల కాలం. ఉద్యోగులంతా పన్నులు చెల్లించకుండా ఎలా మినహాయింపులు పొందాలో లెక్కలేసే రోజులివి. మరి మీరు కూడా పన్నులు చెల్లించే పరిధిలోకి వస్తారా? మరి మీ పన్నుల్ని ప్లాన్ చేసుకున్నారా? ఎలా చేసుకోవాలో తెలియక కంగారు పడుతున్నారా? భయపడాల్సిందేమీ లేదు. కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు. చాలామందికి హెచ్ఆర్ఏ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. కొందరికి సొంత ఇల్లు ఉంటుంది. వాటిపై లోన్లు చెల్లిస్తుంటారు. కానీ ఉద్యోగరీత్యా మరో చోట అద్దెకు ఉంటారు. ఇలాంటి సమయాల్లో హెచ్ఆర్ఏ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు.

హెచ్ఆర్ఏ ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి?

మీ అద్దె ఖర్చుల కోసం మీ సంస్థ యజమాని నుంచి అలెవన్స్ తీసుకుంటున్టయితే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(13 ఏ) కింద హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ) క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి సమయంలో మీరు అద్దె రసీదులు, వార్షిక అద్దె రూ.లక్ష దాటితో ఇంటి యజమాని పాన్ నెంబర్ మీ సంస్థ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ హౌసింగ్ లోన్ ఉంటే మీరు చెల్లించే వడ్డీకి సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ మీరు ఉద్యోగరీత్యా మరో ఊళ్లో ఉన్నా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అది కూడా ఆ ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడే ఈ మినహాయింపు పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో హోమ్ లోన్, హెచ్ఆర్ఏ ఒకేసారి పొందే మార్గం ఉందా అన్నది చాలామంది అనుమానం. కొన్ని సందర్భాల్లో అది సాధ్యమే.

పన్ను లాభాలను దంపతులు విభజించుకోవచ్చు
హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల రాకేష్‌కు కవితతో ఇటీవల పెళ్లైంది. శంషాబాద్‌ దగ్గర రూ.30 లక్షల రూపాయలతో ఓ ఫ్లాట్ తీసుకున్నాడు. నెలకు రూ.18,000 ఈఎంఐ చెల్లించాలి. ఆ తర్వాత దంపతులిద్దరికీ మరో చోట ఉద్యోగం రావడంతో అక్కడ్నుంచి మరోచోటికి వెళ్లిపోయారు. అక్కడ రూ.25,000 అద్దెకు ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు. ఈ సమయంలో రాకేష్, కవిత ఇద్దరూ హెచ్ఆర్ఏ లాభాలు పొందొచ్చా? ఖచ్చితంగా పొందొచ్చు. భారతీయ పన్ను చట్టాల ప్రకారం ప్రతీ ట్యాక్స్‌పేయర్‌ని వేర్వేరుగానే చూస్తారు. పైన చెప్పిన ఉదాహరణలో భార్యాభర్తలు ఇద్దరూ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే నిర్మాణంలో ఉన్న ఇంటికి ట్యాక్స్ లాభాలు వర్తించవు. దంపతులు ఈ విధంగా పన్ను లాభాలు పొందొచ్చు.
- యజమాని నుంచి పొంది హెచ్ఆర్ఏ
- మూలవేతనంలో మెట్రోల్లో 50%, నాన్ మెట్రోల్లో 40%.- చెల్లించిన అద్దె- వేతనంలో 10%

భార్యాభర్తలు పన్ను లాభాలను పంచుకోవాలన్నదానిపై ఎలాంటి శాతం లేదు. ఎవరి వేతనం ఎక్కువగా ఉంటే వాళ్లు ఎక్కువ హెచ్ఆర్ఏ లాభాలు పొందొచ్చు. అందుకే భార్యాభర్తలు వారి జీతాల ఆధారంగా పన్ను లాభాలను పంచుకోవడం సరైన పద్ధతి. అయితే ఎవరు ఎక్కువ ట్యాక్స్ శ్లాబ్‌లోకి వస్తారో వాళ్లే మినహాయింపులు పొందడం మంచిది.

ఇవి కూడా చదవండి:

2019లో ట్యాక్స్ సేవింగ్ ఐడియాలు ఇవే... ఇప్పుడే జాగ్రత్తపడండి

వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్

స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి 5 టిప్స్

లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? తెలుసుకోండి
Published by: Santhosh Kumar S
First published: January 7, 2019, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading