ITEL A47 SMARTPHONE LAUNCHED IN INDIA AT A PRICE OF RS 5499 HERE DETAILS NS GH
Itel A47: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, రూ.5,499కే ఈ సరి కొత్త మోడల్ ను సొంతం చేసుకోండి.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మార్కెట్‌పై కన్నేసింది చైనాకు చెందిన ఐటెల్ సంస్థ. ఈ కంపెనీ వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరల్లో స్మార్ట్ఫోన్లను తయారు చేస్తుంటుంది.
భారత్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మార్కెట్‌పై కన్నేసింది చైనాకు చెందిన ఐటెల్ సంస్థ. ఈ కంపెనీ వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరల్లో స్మార్ట్ఫోన్లను తయారు చేస్తుంటుంది. తాజాగా ఈ సంస్థ నుంచి ఐటెల్ ఏ47 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. చైనాకు చెందిన ఈ సంస్థ, కొత్త మోడల్‌తో భారత్‌లో ఎక్కువ అమ్మకాలను నమోదు చేసుకునే పనిలో నిమగ్నమైంది. ఐటెల్ ఏ47 ఫోన్ 5.5 అంగుళాల HD+ డిస్ప్లేతో లభిస్తుంది. స్పోర్ట్స్ కర్వ్డ్ ఎడ్జులతో, మంచి డిజైన్‌లో దీన్ని రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాస్మిక్ పర్పుల్, ఐస్ లేక్ బ్లూ కలర్లలో ఏ47 అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో దీన్ని అభివృద్ధి చేశారు. మన దేశంలో ఐటెల్ ఎ47 ఫోన్ రూ.5,499కు లభిస్తుంది. ఫిబ్రవరి 5 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.
తక్కువ ధరతో ఎక్కువ పీచర్లు
ఐటెల్ A47 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల HD+ ఫుల్ స్క్రీన్ IPS డిస్ప్లేతో లభిస్తుంది. 2.5D గ్లాస్, 18:9 యాస్పెక్ట్ రేషియోతో దీన్ని రూపొందించారు. 1.4GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 GB ర్యామ్, 32 GB స్టోరేజీ ఆప్షన్, 3,000 mAh బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. ఇది ఆండ్రాయిడ్ 9 పై గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ (5 MP AI లెన్స్ + 5 MP సెకండరీ కెమెరా)తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేశారు. పోర్టెయిట్ మోడ్, స్మార్ట్ రికగ్నిషన్, బ్యూటీ మోడ్ వంటి వివిధ రకాల కెమెరా ఎఫెక్ట్స్ దీంట్లో ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్, మల్టీ ఫంక్షనల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి సెక్యూరిటీ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.